AP Assembly Elections: చంద్రబాబుపై పశుపతి, చంద్రముఖి వ్యాఖ్యలు.. సీఎం జగన్ పై ఈసీ సీరియస్..

AP Assembly Elections:మాజీ సీఎం చంద్రబాబు ని పట్టుకుని, వైఎస్ జగన్ సిద్ధం సభలలో అరుంధతీ సినిమాలోని పశుపతి, చంద్రముఖీ సినిమాలోని కొన్ని క్యారెక్టర్‌ లలో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, ఏపీ ఎన్నికల కమిషన్ స్పందించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2024, 02:36 PM IST
  • సిద్ధం సభలలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..
  • రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న ఈసీ..
AP Assembly Elections: చంద్రబాబుపై పశుపతి, చంద్రముఖి వ్యాఖ్యలు.. సీఎం జగన్ పై ఈసీ సీరియస్..

AP Elections Commission Serious On CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ మరోసారి తమకు పట్టం కట్టాలని ప్రచారం నిర్వహిస్తుంది.అదే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి తమకు ఒక అవకాశం ఇవ్వాలని కూడా అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభల ద్వారా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును పలు సందర్భాలలో సీఎం జగన్ విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబును అరుంధతీ సినిమాలోని పశుపతిలాగా,అదే విధంగా చంద్రముఖి సినిమాలోని విలన్ క్యారెక్టర్ లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇవి ముఖ్యంగా వ్యక్తిగత గౌరవాన్ని, హుందాతనాన్ని దిగజార్చేలా ఉన్నాయని దీనిపై ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Read More: PM MOdi Fan Cut His Finger:మోదీ హ్యట్రిక్ పీఎం కావాలి.. వేలుకోసుకొని కాళీకా దేవికి అర్పించిన అభిమాని.. ఎక్కడంటే..?

ఈ ఘటనలపై..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య రాష్ట్ర ఎన్నికల సంఘనికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన సీఈవో ముకేశ్ కుమార్ మీనా.. సీఎం జగన్ కు నోటీసులు జారీచేశారు. ఈ ఘటనలపై 48 గంటలలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒక వేళ ఎలాంటి వివరణ ఇవ్వకుంటే.. చర్యలు తీసుకొవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. కేంద్రం ఎన్నిలక సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడే.. ఎన్నికలప్రవర్తన నియామవళిని కూడా వెల్లడించింది. దీనిలోని 47 ప్యారా ప్రకారం.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ..ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు,దాడులు, వ్యక్తిత్వ హననం, హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయోద్దని కూడా స్పష్టం చేశారు. దురుద్దేశాలు ఆపాదించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ముఖేస్ కుమార్ మీనా అన్నారు. 

Read More: Angry With Work Pressure: వామ్మో.. సీనియర్ ఎంప్లాయి కన్నింగ్ బుద్ధి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తోటి ఉద్యోగులు.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రస్తుతం ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు పొలిటికల్ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎలాగైన గెలవాలని వైఎస్సార్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలకూడా తనదైనస్టైల్ లో ప్రచారం నిర్వహిస్తు,  గట్టిపోటీని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈసీ నోటీసులకు సీఎం జగన్ ఎలాంటి రిప్లై ఇస్తారో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News