Ongole District News: షాక్ లో పోలీసులు.. మర్రిచెట్టు తొర్రలో డబ్బుల కట్టలు.. అసలేం జరిగిందంటే..?

Ongole District: చోరిచేసిన సొత్తు ఎక్కుడ దాచాలో బాగా ఆలోచించారు. చివరకు ఒక చెట్టు తొర్రలో దాడిపెడితే ఎలా ఉంటుదంని ప్లాన్ చేశారు. ఎవరికి అనుమానం రాదనుకొని భావించి చెట్టుతొర్రలో దాదాపు 66 లక్షల సొత్తును దాచిపెట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2024, 02:52 PM IST
  • చెట్టు తొర్రలో డబ్బుల కట్టలు..
  • ఏటీఎం చోరీ చేసిన నిందితుల ఐడియా..
Ongole District News: షాక్ లో పోలీసులు.. మర్రిచెట్టు తొర్రలో డబ్బుల కట్టలు.. అసలేం జరిగిందంటే..?

Ongole Police Recovered 66 lakhs rupees from banyan tree: చోరీ చేయడం కూడా ఒక ఆర్ట్ అని చాలా మంది చెబుతుంటారు. కొందరు చోరీలు చేసి వెంటనే పారిపోతుంటే, మరికొందరు మాత్రం చోరీలు చేసి అడ్డంగా దొరికిపోతుంటారు. కొందరు రాత్రిళ్లు చోరీలకు ప్లాన్ లు చేస్తుంటారు. రోడ్డుపైన సింగిల్ గా వెళ్తున్నప్పుడు కూడా కొందరు చోరీలు చేయడం మనం చూస్తు ఉంటాం. అదే విధంగా.. కొందరు అడ్రస్ అడిగినట్లు నటించి, మెడలోని బంగారు చైన్ లు లాగి వెళ్లిపోతుంటారు. పట్టపటగలే ఇంట్లో చోరీలకు పాల్పడిన ఘటనలు కొకొల్లలు. ఇక మరికొన్ని చోట్ల గోల్డ్ షాపులు, బ్యాంకులలో కూడా చోరీలు జరుగుతుంటాయి. ఇక ఏటీఎంలలో కూడా డబ్బులు చోరీలు చేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Read More: Donkeys Business: గాడిదల బిజినెస్ చేస్తూ కళ్లు చెదిరే లాభాలు.. లీటర్ పాల ధర తెలిస్తే షాక్ తో నోరెళ్ల బెడతారు..

పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఓంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులను పెట్టేందుకు ఒక వ్యాన్ బయలుదేరింది.ఈ వ్యాన్ కర్నూలు దగ్గర ఆపి, సిబ్బంది భోజనం కోసం వెళ్లారు. తిరిగి వచ్చిచూసేసరికి డీసీఎం వ్యాన్ తలుపులో తెరుచుకుని ఉన్నాయి. దానిలోని ఐదువందల నోట్ల కట్టలు మాయమవ్వడం సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెర్చింగ్ ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల ఏరియాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసులకు దీనిలో ఘటనకు పాల్పడింది ఇంటి దొంగల పనిఅని తెలిసిపోయింది. వెంటనే కొందరిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా చోరీ ఘటన బైటపడింది.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

డబ్బులు ఎక్కడున్నాయని ఆరా తీయగా.. ఒక చెట్టు తొర్రలో దాచినట్లు నిందితులు సమాచారం ఇచ్చారు.వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చెట్టు తొర్రలో ఉన్న డబ్బుల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దొంగల ఐడియా చూసి.. ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ చెట్టు తొర్రలో ఒక క్లాత్ లో ఏర్పాటు చేసి, అందులో ఒకప్లాస్టిక్ కవర్ ఏర్పాటు చేసి అందులో డబ్బులను ఉంచినట్లు గుర్తించారు. ఇప్పుడు చోరీ సోత్తును స్వాధీనంచేసుకుని, నిందితులను కోర్టులో హజరుపర్చినట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News