AP Speaker: ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ నేడే, అనర్హత వేటు పడేనా

AP Speaker: ఏపీలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ విచారణ జరగనుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2024, 09:44 AM IST
AP Speaker: ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ నేడే, అనర్హత వేటు పడేనా

AP Speaker: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం 9 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆ 9 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా విచారించనున్నారు. ఎవరెవరు హాజరై వివరణ ఇస్తారు, ఎవరిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. 

ఏపీ స్పీకర్ నలుగురు వైసీపీ రెబెల్, నలుగురు టీడీపీ రెబెల్, ఒక జనసేన రెబెల్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఇవాళ ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యక్తిగతంగా నలుగురినీ విచారించనున్నారు. ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. ఈ 9 మందిలో గుంటూరు వెస్ట్ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరుకాకపోవచ్చు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో మద్యాహ్నం 2.45 గంటలకు హాజరుకావల్సి ఉంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ ఉండగా జనసేన రెబెల్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. 

ఈ ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణను బట్టి అనర్హత వేటుపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ విచారణకు ఎవరెవరు హాజరౌతారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి టీడీపీకు అనుకూలంగా ఓటేశారు. 

Also read: Indian Railway New Rules: రైళ్లో లోయర్ బెర్త్ కొత్త రూల్స్, ఇక ఆ సీటు వారిదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News