Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

YS Jagan Kuppam Tour: మూడు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పం నియోజకవర్గంపై అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నేసింది. గత ఎన్నికల్లోనే బాబును ఓడించినంత పనిచేసిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో అతడి ఓటమే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్‌ కుప్పంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2024, 03:42 PM IST
Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

Kuppam Branch Canal: ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేసి సోమవారం జాతికి అంకితం చేశారు. 2022లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. 672 కిలోమీటర్ల నుంచి కృష్ణా జలాలు ఇక్కడకు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహర్లు' అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? అని ప్రజలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన పాలనలో కుప్పం నియోజకవర్గానికి చేసిన సేవలను సీఎం జగన్‌ వివరించారు.

Also Read: AP Politics: ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచవ్‌ పవన్‌? మంత్రి రోజా నిలదీత

'కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది.. రెవెన్యూ డివిజన్‌ చేసింది.. చిత్త పాల డెయిరీని పునఃప్రారంభించింది.. కృష్ణమ్మ నీరును తీసుకొచ్చింది మీ జగన్‌. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం' అని  సీఎం జగన్‌ చెప్పారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని చంద్రబాబు అవసరమా అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? అని అడిగారు. 35 ఏళ్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏమైనా మేలు చేసిండా? అని ప్రశ్నించారు.

Also Read: Inter Hall Tickets: ఏపీ ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇలా..

కృష్ణమ్మ నీటిని తీసుకొచ్చి మీ కలను సాకారం చేశామని సీఎం జగన్‌ తెలిపారు. రెండు లక్షల మంది ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. మూడు దశాబ్దాలుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తిచేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించామని వివరించారు. కుప్పం ప్రజలంతా మావాళ్లేనని గర్వంగా చెబుతున్నా అని ప్రకటించారు. కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నన్ను, సీమను తిడుతూ ఉంటాడని చెప్పారు. అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు అని కుప్పం ప్రజలను సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబును నిలదీయాల్సిన సమయం వచ్చిందని గుర్తుచేశారు. 

బాబును ఓడిస్తే..
చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? అని అడిగారు. మంచి చేసి ఉంటే బాబుకు పొత్తులెందుకు అన్నారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఈసారిని చంద్రబాబును ఓడించండి అని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ తరఫున భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భరత్‌ గెలిచిన వెంటనే మంత్రిని చేస్తామని, కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అంతకుముందు కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించే పాలారు ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం జగన్‌, మంత్రి అంబటి రాంబాబు శంకుస్థాపన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News