Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

Pawan Kalyan Interview with Zee Telugu News: జీ తెలుగు న్యూస్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్‌ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్.. జీ తెలుగు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.   

Written by - Ashok Krindinti | Last Updated : May 10, 2024, 09:08 PM IST
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Live Blog

Pawan Kalyan Interview with Zee Telugu News: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడారు. బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏపీ రాజకీయ స్థిరత్వం కోసమే కూటమి జతకట్టానని అన్నారు. జగన్ పాలనంతా రివర్స్ టెండరింగ్, పాలసీ టెర్రరిజమని విమర్శించారు. ప్యాకేజ్ స్టార్ అని విమర్శించినా బాధ లేదని.. నాయకుడికి విమర్శలు కామన్ అని అన్నారు. వాళ్ల మాటలకు ఒక్కొసారి చెప్పు చూపించాలని అనిపిస్తుందన్నారు. కూటమి విజయం ఖాయమని.. భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తనకు సీఎం కూర్చీపై ఆశ లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని.. పదవి సంగతి తరువాత చూద్దామన్నారు. జనకోసమే పార్టీ పెట్టానని.. మాటలు పడ్డానని.. ఏదో ఒక రోజు గెలిచి తీరుతానని పవన్ అంటున్నారు. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి..

 

10 May, 2024

Trending News