Loksabha polls 2024: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..

Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు  రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా  తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 12, 2024, 10:20 PM IST
  • ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య పండుగ..
  • అందరు ఓటు హక్కును ఉపయోగించుకొవాలన్న సీఈవో ముఖేష్ కుమార్ మీనా..
Loksabha polls 2024: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..

AP ceo mukesh kumar meena urges people must caste there vote: ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ఓటు హక్కు కీలకంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికలు అనేవి.. ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని ఏపీ సీఈవో అన్నారు. ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో మే 13 న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు, 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా  మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Read more: AP Elections: ఏపీలో ప్రలోభాల పర్వం.. పిఠాపురం, మంగళగిరి, కుప్పం, నగరిలో భారీగా డబ్బులు, కానుకలు

వీటిలో సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 31,385 పోలింగ్ కేంద్రాలను అంటే 75 శాతం పోలింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో లోపలా, బయట కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా,  రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.  ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని ఆయన తెలిపారు.

జీరో వయొలెన్సు లక్ష్యంగా ..
 

జీరో వయొలెన్సు లక్ష్యంగా రాష్ట్రంలోని 75 శాతం పోలింగ్ కేంద్రాలను అంటే 31,385 పోలింగ్ కేంద్రాలను నిరంతర వెబ్ కాస్టింగ్ ద్వారా  రాష్ట్ర  స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో పర్యవేక్షించడం జరుగుచున్నదన్నారు. 26 జిల్లాలకు సంబందించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని  పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షించడం జరుగుచున్నదన్నారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బందికి నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

60 లక్షల ఈవీఎమ్ లు..
 

ఏపీ రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎమ్ లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.  వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎమ్ లనుకూడా సిద్దంగా ఉంచడం జరిగిందన్నారు. నిజానికి మొదట్లో ప్రతిపాదించిన విధంగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎం లు సరిపోతాయని, అయితే అదనంగా ప్రతి పాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎం లు సమకూర్చుకున్నామన్నారు.  మొత్తం మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎమ్ లను వినియోగిస్తున్నామన్నారు. 

83 శాతం ఓటింగ్ టార్గెట్

రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు అయిందని,  అయితే ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఓటర్లను చైతన్య పర్చే విధంగా అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించండం జరిగిందన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమ్తతం చేస్తూ దిన పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం  జరిగిందన్నారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన త్రాగునీరు, వీల్ చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పురుషులకు, మహిళలకు వేరు వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్దులకు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Read more: Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News