Pawan Kalyan: మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రా? చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రా? మనసులో మాట చెప్పిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan Revealed Personal Life Kids Education Family Details In Zee Telugu News Interview: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 10, 2024, 09:34 PM IST
Pawan Kalyan: మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రా? చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రా? మనసులో మాట చెప్పిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఓటమి నుంచి తనకు తాను గెలిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లానని స్పష్టం చేశారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి నాకు అనుభవం నేర్పిందని తెలిపారు. వీడియో సందేశంతో చిరంజీవి అన్నయ్య తనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారని పేర్కొన్నారు. అభిమానంతో ఓట్లు పడవని తనకు తెలుసని.. పదేళ్లుగా అదే జరిగిందని వివరించారు.

Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న జనసేన వ్యవస్థాపకులు పవన్‌ కల్యాణ్‌ జీ తెలుగు న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బిడ్‌ డిబేట్‌ విత్‌ భరత్‌లో పవన్‌ కల్యాణ్‌ కీలక విషయాలపై మాట్లాడారు. వ్యక్తిగత జీవితంతోపాటు రాజకీయాలు, ఎన్నికల్లో తమ విజయం తదితర అంశాలపై స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో గెలుస్తాం. కూటమి విజయం పక్కా అవుతుంది. గెలిచి రాష్ట్రాన్ని పునర్‌నిర్మిస్తాం. రాజకీయం అంటే కత్తులతో చేసే యుద్ధం కాదు' అని తెలిపారు. సీఎం జగన్‌ చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ను తప్పుబట్టారు. 

Also Read: Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

 

నా దగ్గర డబ్బులు లేవు
'జగన్‌ చరిత్రంతా భయం రాజకీయం. జగన్‌లాగా నా దగ్గర డబ్బులు లేవు. సంక్షేమ పథకాలతో ఏపీలో రాజకీయ స్థిరత్వం కోసం పొత్తు పెట్టెకున్నా. ప్యాకేజ్‌ స్టార్‌ అని విమర్శించినా బాధ లేదు. నాయకుడికి విమర్శలు సాధారణం' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఓడి గెలిచా..
రెండు ఎన్నికల్లో ఓడిపోవడంపై పవన్‌ స్పందించారు. 'ఓడిపోయినప్పుడు నాకు నేను గెలిచా. చిరంజీవి నాకే సర్‌ప్రైజ్‌ ఇచ్చా. జనం కోసం పార్టీ పెట్టా. మాటలు పడ్డా. ఏదో ఒకరోజు విజయం సాధిస్తా' అని తెలిపారు. సినిమాలు చేయడం ద్వారా తాను సేవా కార్యక్రమాలు చేశానని చెప్పారు. 'విమర్శలు సహజం. వారు నన్ను విమర్శిస్తుంటే ఆనందంగా ఉంటుంది. కొన్నిసార్లు చెప్పు చూపించాల్సి వస్తుంది. నన్ను అంటే కోపం రాదు. కానీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోపం వస్తుంది' అని వివరించారు.

నా ఇల్లు రాసిచ్చేశా..
పిల్లలకు విద్య మాత్రమే నేను ఇస్తా. సాధారణ పిల్లల మాదిరిగానే వారిని పెంచుతున్నా. నా భార్య, పిల్లలకు నా ఇల్లు రాసిచ్చా. ఎంత ఆస్తి ఇచ్చామని ముఖ్యం కాదు. ధైర్యం, నైపుణ్యాలు నా పిల్లలకు ఇచ్చా.

రాష్ట్రానికే పరిమితం
ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే ఉంటాను. మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రా? అనేది తర్వాత చూద్దాం. ఐదేళ్ల తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే ఏపీ ఫస్ట్‌. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటానా? లేదా? అనేది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఎన్నికలు కానివ్వండి. అన్నయ్య చిరంజీవి ప్రచారానికి వస్తారా లేదా అనేది తెలియదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News