Salaar Movie: ఏపీ, తెలంగాణలో సలార్ సినిమా టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

Salaar Movie: ప్రభాస్ అభిమానులకు శుభవార్త, మరో రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా టికెట్ల పెంపుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మొదటి పదిరోజులు టికెట్ పెంపుకు అనుమతి లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2023, 09:57 AM IST
Salaar Movie: ఏపీ, తెలంగాణలో సలార్ సినిమా టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

Salaar Movie: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్దమౌతోంది. చాలాకాలంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. 

సలార్ సినిమా మరో రెండ్రోజుల్లో అంటే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సలార్ సినిమా టికెట్లు పెంచుకునేందుకు అనుమతించాయి. ఏపీలో మొదటి పదిరోజులు 40 రూపాయలు, తెలంగాణలో 65 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయల వరకూ పెంచుకోవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం లేదా పదిరోజులు టికెట్ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తుంటాయి. అందులో భాగంగా సలార్ సినిమా టికెట్ల పెంపుకు అనుతించాయి. ఏపీలో అన్ని రకాల థియేటర్లపై మొదటి పదిరోజులు 40 రూపాయలు టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఉంది. తెలంగాణలో మొదటి వారం రోజులు అంటే డిసెంబర్ 28 వరకూ 65 రూపాయలు పెంచుకోవచ్చు. 

సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. డిసెంబర్ 22 నుంచి 28 వరకూ తెలంగాణలో టికెట్లు పెంచుకోవచ్చు. అంతేకాకుండా అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ షోలతో పాటు ఉదయం 4 గంటల్నించి అదనంగా మరో షోకు అనుమతి లభించింది. సలార్ సినిమాకు ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ నిన్న రాత్రి ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో సర్వర్ క్రాక్ అయిపోయింది. చాలాసేపటి వరకూ బుక్ మై షో యాప్ పనిచేయలేదు. తొలిరోజు అడ్వాన్స్ బుకింగే 50 కోట్లకు చేరుండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Also read: Salaar: కళకళలాడిపోయిన థియేటర్లు…ప్రభాస్ పుణ్యమా అని మళ్లీ అలా…

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News