YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..

YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2024, 10:48 AM IST
  • నా చీర గురించి మాట్లాడటానికి ఇంగితం లేదా..
  • సీఎం జగన్ పై ఫైర్ అయిన వైఎస్ షర్మిల
 YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..

YS Sharmila Comment On CM YS Jagan In Public meeting: ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ హీట్.. సమ్మర్ హీట్ కన్నా ఎక్కువగా ఉందని చెప్పుకొవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది రాజకీయ నేతలు, కౌంటర్ లు, రివర్స్ కౌంటర్ లతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈక్రమంలో ఏపీలో సీఎంవైఎస్ జగన్ పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ఒక్కడిని ఢీకొట్టడానికి టీడీపీ, బీజేపీ,జనసేన పొత్తుగా వస్తున్నాయని అన్నారు. వీరు చాలదన్నట్లు తన చెల్లెళ్లు కూడా పచ్చమీడియాతో రహాస్య ఒప్పందం కుదుర్చుకుని తనపై యుద్దానికి దిగారంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. వైఎస్ షర్మిల పసుపు చీరకట్టుకుని మరీ, తన అపోసిషన్ నేతల ఇంటికి వెళ్లిదంటూ కూడా కామెంట్లు చేశారు. విరోధులతో కలిసే వారు.. వైఎస్ రక్తం ఎలా అవుతారని షర్మిల,సునీతలపైతీవ్రమైన ఆరోపణలు చేశారు.

Read More: Heavy Rains: వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వడగండ్ల వానలు..

అంతేకాకుండా..వైఎస్ వివేకాకు రెండో పెళ్లి జరగడం,సంతానం ఉండటం కూడా ఉండటం వాస్తవమనేనని సీఎం వైఎస్ జగన్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.  ఈ క్రమంలో సీఎం జగన్ చేసిన ఆరోపణలకు వైఎస్ షర్మిలా కౌంటర్ అటాక్ ఇచ్చారు. వేల మంది మగాళ్ల ముందు, తన చెల్లెలు చీర గురించి సీఎం జగన్ మాట్లాడటం పట్ల వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పసుపు రంగును చంద్రబాబు ఎక్కడైన కాపీ రైట్ చేసుకున్నాడా.. మీ పత్రికలో పసుపు రంగు ఉండదా.. నా పసుపు రంగు చీర గురించి మాట్లాడటం సీఎం జగన్ కు సిగ్గుగా అన్పించలేదా.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన చెల్లెలు దుస్తుల గురించి ప్రస్తావన చేశావంటే ఇంతటి దిగజారుడుతనం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. 

గురువారం గుంటూరు, విజయవాడ ల్లో జరిగిన ప్రచార సభల్లో వైఎస్ షర్మిల ప్రసంగించారు. పులివెందులలో తనపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ తనను టీడీపీ దగ్గర మోకరిల్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలైతే. కేంద్రంబీజేపీ వద్ద మోకరిల్లింది నువ్వు కాదా..జగన్ అంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారో.. బెయిల్ రావడం ఇబ్బందిగా మారుతుందో అని ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి మోదీలో లాలూచీ చేస్తుంది నువ్వు కాదా.. అంటూ శివాలెత్తారు. తనకు ఎవరి ముందు మోకరిల్లాల్సిన అవసరంలేదని వైఎస్ రక్తం ఎవరి ముందు తలవంచదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులుపెడుతున్న కూడా, వెనక్కు తగ్గకుండా కౌంటర్ లు ఇస్తున్నానని అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాను ఏపీప్రజలకు రాకుండా బీజేపీతో కుమ్మక్కైందీ నువ్వుకాదా..అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

Read More: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

వైఎస్‌ పేరు చేర్చింది జగన్‌ లాయరే..

జగన్‌ కేసుల చార్జిషీటులో వైఎస్‌ఆర్ పేరును చేర్చింది సీబీఐ, కాంగ్రెస్‌ కాదు. ఆ పనిచేసింది ఆయన లాయర్ సుధాకర్ రెడ్డి అని షర్మిల అన్నారు. ఆ కేసులో.. వైఎస్‌ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్‌ బయటపడరని .. స్వయంగా సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసి చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా వైసీపీ అధికారంలోకి రాగానే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా?.. దీనిపైఎలాంటి సమాధానం చెప్తారని వైఎస్ జగన్ కు, వైఎస్ షర్మిల దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News