Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో అందుబాటులో రానుంది. బౌన్స్ సంస్థ కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. రెండు వేరియంట్లలో రానున్న ఈ స్కూటర్ల వివరాలివీ..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 8, 2021, 10:29 AM IST
  • బౌన్స్ సంస్థ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో
  • ఏడాది కాలంలో ఈ స్కూటర్ల కంపెనీపై 742 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం
  • 2022 ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ల పంపిణీ ప్రారంభం
Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో అందుబాటులో రానుంది. బౌన్స్ సంస్థ కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. రెండు వేరియంట్లలో రానున్న ఈ స్కూటర్ల వివరాలివీ..

ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Scooters) రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్(Bounce) కొత్తగా ఈ స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ నిమిత్తం ఏడాది కాలంలో 742 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఈ నెలాఖరునాటికి  తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టనుంది. ఆ తరువాత ప్రీ బుకింగ్ ప్రారంభమవుతుంది. 2022 ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ల డెలివరీ ప్రారంభం కానుంది. ప్రీ బుకింగ్‌లో లక్ష వరకూ ఆర్డర్లు వస్తాయనేది కంపెనీ అంచనా. బ్యాటరీతో కలిపి వాహనం ధర 70 వేలలోపుంటుంది. బ్యాటరీ లేకుండా 50 వేలలోపు ఉండనుంది. బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ ఛార్జర్ ద్వారా ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే మాత్రం బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ విధానంలో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చు.హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పూణె వంటి ఆరు నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లు(Battery Exchange Stations) ఏర్పాటు కానున్నాయి.

తొలిదశలో రాజస్థాన్‌లోని(Rajasthan)భివాడీ ప్లాంటులో ఈ స్కూటర్లు ఉత్పత్తి కానున్నాయి. రెండవ లొకేషన్ ఎక్కడ పెట్టాలనేది కంపెనీ ఆలోచిస్తోంది. భివాడీ ప్లాంటు సామర్ధ్యం ఏడాదికి 1.8 లక్షల స్కూటర్లు కాగా 3-4 నెలల్లో ఈ ప్లాంటు ద్వారా వేయిమందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో వందమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ ప్లాంటుపై 25 మిలియన్ డాలర్లు, బ్యాటరీ మార్పిడిపై 50-75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. 

Also read: Evergreening: కస్టమర్ల సమ్మతి లేకుండానే రుణాలిచ్చేసిన బ్యాంకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News