Cheapest Electric Scooters: డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 45 వేల నుంచి స్టార్ట్! 121 కిమీ ప్రయాణం

Best Electric Scooters 2023, Here is Cheapest Electric Scooters List. కొన్ని చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌తో మీరు 121 కిమీ ప్రయాణం చేయొచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 23, 2022, 02:46 PM IST
  • డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • రూ. 45 వేల నుంచి స్టార్ట్
  • 121 కిమీ ప్రయాణం
Cheapest Electric Scooters: డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 45 వేల నుంచి స్టార్ట్! 121 కిమీ ప్రయాణం

Here is Cheapest Electric Scooters List: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తుండడంతో.. నిత్యం ఎన్నో రకాల కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. రోడ్లపైన పది వాహనాలలో 3-4 ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే కొన్ని చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మార్కెట్లో డెడ్ చీప్‌వి అందుబాటులో ఉన్నాయి. ఆ వాహనాలు ఏవో ఓసారి చూద్దాం. 

Avon E Scoot:
అవాన్ ఇ స్కూట్ ధర సుమారు రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని పూర్తి ఛార్జింగ్‌తో 65 కి.మీల ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం 24KMPH. ఈ స్కూటర్ 215W BLDC మోటార్ మరియు 48V/20AH బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-8 గంటల సమయం పడుతుంది.

Bounce Infinity E1:
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1ధర రూ. 45,099 (బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో వస్తుంది. స్కూటర్ టాప్ స్పీడ్ 65kmph. ఇక 85km ప్రయాణం చేయొచ్చని అని కంపెనీ పేర్కొంది.

Hero Electric Optima CX:
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ (ఒకే బ్యాటరీ వేరియంట్) ధర రూ. 62,190. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 45 KM/H మరియు రేంజ్ 82KM అని కంపెనీ పేర్కొంది. ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 51.2V/30Ah బ్యాటరీతో వస్తుంది. 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

Ampere Magnus EX:
ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ స్కూటర్ LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారంతో వస్తుంది. ఇది 1.2 kW మోటార్‌తో రన్ అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఈ స్కూటర్ 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది. మీరు 121 కిమీ ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ ధర రూ.73,999.

Also Read: IPL 2023 Auction: ఫ్రాంఛైజీలకు శుభవార్త చెప్పిన బీసీసీఐ.. బెన్ స్టోక్స్, కామెరూన్‌ గ్రీన్‌కు పండగే పండగ!  

Also Read: IPL Auction 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసిరానున్న వేలం.. స్టార్ ఆటగాళ్లే లక్ష్యం! స్టోక్స్, కరన్ వస్తే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News