CIBIL Score Without Loans: అసలు క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా ?

CIBIL Score Without Credit History:  అసలు ఏ క్రెడిట్ హిస్టరీ లేనివాళ్లు రుణం తీసుకోవాలంటే లేదా క్రెడిట్ కార్డు పొందాలంటే క్రెడిట్ హిస్టరీ లేకుండా సిబిల్ స్కోర్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం. 

Written by - Pavan | Last Updated : May 26, 2023, 07:42 PM IST
CIBIL Score Without Loans: అసలు క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా ?

CIBIL Score Without Credit History: పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్.. ఇలా ఏ లోన్ కావాలన్నా మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే తక్కువ వడ్డీ రేటుకు ఆ రుణం లభించే అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసిందే. అలాగే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ లిమిట్‌తో, ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు అందించే క్రెడిట్ కార్డు కావాలనుకున్నా.. మీకు అంతకంటే ముందే మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాల్సిందే. ఆ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లభించిన సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు లోన్ లభిస్తుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. మరి అసలు ఏ క్రెడిట్ హిస్టరీ లేనివాళ్లు రుణం తీసుకోవాలంటే లేదా క్రెడిట్ కార్డు పొందాలంటే క్రెడిట్ హిస్టరీ లేకుండా సిబిల్ స్కోర్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం. క్రెడిట్ హిస్టరీ లేదు కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికతో ఇలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ సమయం అవసరం లేకుండా తక్కువ సమయంలోనే మంచి క్రెడిట్ హిస్టరీని సొంతం చేసుకోవచ్చు.

ఏ క్రెడిట్ హిస్టరీ లేకుండా మొట్టమొదటిసారి లోన్ తీసుకునే వారికి ఎదురయ్యే మొదటి సవాలు ఏంటంటే.. వారికి సిబిల్ స్కోర్ లేకపోవడమే. గతంలో ఎలాంటి రుణం తీసుకోకపోవడమే అందుకు కారణం. వారికి ఏ లోన్ తీసుకోకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం వల్ల వారికి ఎలాంటి రుణం తీసుకోవాల్సిన అవసరం రాకపోవడం కావచ్చు లేదా ఏది కొనుగోలు చేసినా వారు పూర్తి పేమెంట్ చేసి కొనుగోలు చేయడమే కావొచ్చు. లేదంటే అసలు ఇప్పటివరకు ఏదీ కొనాల్సిన అవసరమే రాకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించి కొత్తగా ఇంట్లో ఆర్థిక బాధ్యతలు తీసుకునే వారు ఈ చివరి కోవలోకే వస్తారు. 

అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు / సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ 
క్రెడిట్ కార్డు అంటే తెలుసు కానీ ఈ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు , సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా ? మరేం లేదు.. అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు జారీ చేయడానికి బ్యాంకులు సిబిల్ స్కోర్‌తో పాటు దరఖాస్తుదారుల ఆదాయ మార్గాలను చెక్ చేస్తాయి. కానీ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులకు దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్‌తో బ్యాంకులకు పని లేదు. అదెలా అంటారా ? అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనే పేరులోనే వాటి అర్థం కూడా దాగి ఉంది. అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు జారీ చేయడానికి బ్యాంకులకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు కానీ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ కోసం బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటాయన్నమాట. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులు ఈ సెక్యూరిటీని స్వీకరిస్తాయి. అలా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి వారి క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండా జారీ చేసే క్రెడిట్ కార్డులనే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు అంటారు. 

మీ శాలరీ ఆధారంగా మీకు సిబిల్ స్కోర్ లేకున్నా తక్కువ క్రెడిట్ లిమిట్ తో బ్యాంకులు అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు మంజూరు చేస్తాయి. ఒకవేళ అది సాధ్యపడకపోతే.. రెండో ఆప్షన్ ఎంచుకుని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డుని ఉపయోగించి ఒక క్రమశిక్షణతో సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం ద్వారా మీరు సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు. 

కుటుంబసభ్యుల్లో మరొకరి కార్డులో ఆధరైజ్డ్ మెంబర్ అవ్వండి
అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు లభించనట్టయితే.. మీ కుటుంబంలోనే మీ జీవిత భాగస్వామి క్రెడిట్ కార్డులో కానీ లేదా మీ సోదరుడు, సోదరి, తల్లిదండ్రుల క్రెడిట్ కార్డులో మిమ్మల్ని ఆథరైజ్డ్ మెంబర్ గా చేర్చాల్సిందిగా చెప్పండి. అలా ఆథరైజ్డ్ క్రెడిట్ కార్డు మెంబర్ గా చేరిన తరువాత క్రమశిక్షణతో సకాలంలో ఫుల్ టైమ్ పేమెంట్ చేస్తూ ఉండండి. తద్వారా మీ క్రెడిట్ హిస్టరీ రికార్డ్ అవడంతో పాటు సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. 

అయితే, ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఆ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. అసలే మీ పేరుపై ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో పాటు మీరు క్రెడిట్ కార్డు బిల్లు కూడా చెల్లించని కారణం చేత మీ సిబిల్ స్కోర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం తెలుసుకుంటే మీరు ఆ పొరపాటు చేయకుండా ఉంటారు. అలా ఆరు నెలల పాటు మీరు ఆథరైజ్డ్ మెంబర్ గా ఉన్నట్టయితే.. ఆ తరువాత మీరే సొంతంగా అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి నుంచి మీ సిబిల్ స్కోర్ మరింత మెరుగుపడేలా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Car Buying Tips: కారు కొనేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

సెక్యూర్డ్ లోన్ తీసుకుని సకాలంలో ఈఎంఐలు చెల్లించడం
సెక్యూర్డ్ లోన్ తీసుకుని సకాలంలో ఈఎంఐలు చెల్లించడం సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మీ ముందున్న మరో పద్ధతి. మీ వద్ద ఉన్న ఏదైనా ఆస్తిని తనఖా పెట్టి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తూ గుడ్ రీపేమేంట్ హిస్టరీ ఏర్పడిన తరువాత మీకు సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది. ఆ తరువాత ఏ సెక్యూరిటీ లేకుండానే మీకు మీ సిబిల్ స్కోర్ ఆధారంగా రుణం లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆర్థిక పరమైన సందేహాలు, సమాచారంతో కూడిన వార్తా కథనాల కోసం జీ తెలుగు న్యూస్ కథనాలు చదువుతూ ఉండండి.

ఇది కూడా చదవండి : Maruti Jimny Bookings Crossed 30000: మారుతి సుజుకి జిమ్ని కోసం ఎగబడుతున్న జనం

ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇది కూడా చదవండి : Rs 2,000 Notes News: బాగా డబ్బున్నోళ్లు 2 వేల నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News