Yamaha Aerox S: యమహా నుంచి స్మార్ట్ కీ ఆప్షన్, 150 సిసి ఇంజన్‌తో కొత్త స్కూటీ

Yamaha Aerox S: దేశంలో ఇప్పుడు స్కూటీ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో స్కూటీలు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా యమహా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ కీ ఆప్షన్ స్కూటీ ఇది. పూర్తి వివరాలు తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2024, 03:48 PM IST
Yamaha Aerox S: యమహా నుంచి స్మార్ట్ కీ ఆప్షన్, 150 సిసి ఇంజన్‌తో కొత్త స్కూటీ

Yamaha Aerox S: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటీ బైక్ లాంచ్ అయింది. Yamaha Aerox Sలో రెండు మోడల్స్ ఉన్నాయి. స్మార్ట్ కీ ఆప్షన్ కావడంతో మంచి ఆదరణ లభించవచ్చు. 

యమహా ద్విచక్ర వాహనాలకు దేశంలో చాలా ఆదరణ ఉంది. యమహా మోటార్స్ ఇండియా మరో కొత్ స్కూటీ లాంచ్ చేసింది. Yamaha Aerox S పేరుతో లాంచ్ అయిన ఈ స్కూటీ సిల్వర్, రేసింగ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా స్మార్ట్ కీ ఆప్షన్ ఉంది. స్మార్ట్ కీ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఫ్లాషింగ్ ఇండికేటర్ ట్రిగ్గర్ చేసి స్కూటీ ఎక్కడుందో గుర్తించవచ్చు. ఈ మల్టిపుల్ ఆప్షన్స్‌కు పనిచేస్తుంది. ఇందులో ఇమ్యుబిలైజర్ ఫీచర్ కూడా అమర్చారు. మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే స్మార్ట్ కీ పరిధి వెలుపల ఉన్నప్పుడు దానికదే లాక్ అవుతుంది. ఇక ఎల్ఈడీ లైటింగ్, ఛార్జింగ్ సాకెట్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఈ స్కూటీ పెట్రోల్ స్టోరేజ్ 25 లీటర్లు కాాగా 126 కిలోల బరువుంటుంది.

Yamaha Aerox S 155 సీసి సింగిల్ సిలెండర్ వీవీఏ ఇంజన్ కలిగి ఉండటమే కాకుండా గరిష్టంగా 15 బీహెచ్‌పీ పవర్, 13.9 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక ధర అయితే ఎక్స్ షోరూం 1 లక్షా 50 వేలుంది. 

ఇది కాకుండా లక్ష రూపాయల్లోపు ధరలో యమహా ఇటీవలే అప్‌డేట్ చేసిన రెండు స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అవి యమహా ఫాసినో, రే జెడ్ఆర్‌లు. యమహా ఫాసినో ఎస్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వేరియంట్ ధర 91,030 రూపాయలు కాగా రే జెడ్ఆర్ 125 ధర 89,530 రూపాయలుగా ఉంది. ఇక రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ధర మాత్రం 93,530 రూపాయలు. 

Also read: Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎస్‌యూవీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News