క్రేజీ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి !

సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్లు అంటే తెలియని ఆసక్తి. పలానా హీరోహీరోయిన్లు జోడి కడితే భలే ఉంటుందని, సక్సెస్ ఖాయమని అభిమానులతో పాటు దర్శకనిర్మాతలు, టీమ్ భావిస్తోంది.

Last Updated : Apr 27, 2020, 02:50 PM IST
క్రేజీ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి !

ఇతర రంగాలతో పోల్చితే సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్లు అంటే తెలియని ఆసక్తి. పలానా హీరోహీరోయిన్లు జోడి కడితే భలే ఉంటుందని, సక్సెస్ ఖాయమని అభిమానులతో పాటు దర్శకనిర్మాతలు, టీమ్ భావిస్తోంది. కొన్నిసార్లు తమకు టైమ్ అచ్చిరాని సమయంలో క్రేజీ కాంబినేషన్‌లతో హిట్ ఖాయమని మరోసారి ట్రై చేస్తారు.   ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి

తాజాగా అలాంటి కబురు మరొకటి వచ్చింది. ఉయ్యాల జంపాలతో తెలుగు తెరకు పరిచయమైన హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, అవికా గోర్‌లు మరోసారి తెరపై సందడి చేయనున్నారు. తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ జంట ఆపై కొన్ని వరుస సినిమాల్లో నటించారు. రెండోసారి అవికా, రాజ్ తరుణ్ స్క్రీన్ మీద కనిపించి మరో హిట్ అందుకున్నారు. త్రినాథరావు దర్వకత్వంలో వచ్చిన సినిమా చూపిస్త మావ సినిమాతో ఈ జోడీ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ప్రేక్షకులు సైతం ఈ జోడీ కెమిస్ట్రీకి బాగానే కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!

వీరి కాంబినేషన్‌లో మూడో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ గతంలో నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీ దర్శకుడు శ్రీనివాస్ గోవిరెడ్డి కొత్త సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ్ తరుణ్, అవికా గోర్ కాంబినేషన్ ఈ సినిమాకు న్యాయం చేస్తుందని అంతా ఒకే చేసుకున్నారు. లాక్‌డౌన్ ముగియగానే సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మూవీ యూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 

Trending News