Adah Sharma: జోరుపెంచిన అదా శర్మ.. ‘C.D’ ట్రైలర్‌తో భయపెట్టేందుకు రెడీ

Criminal Or Devil Trailer: ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది అదా శర్మ. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. మే 10వ తేదీన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2024, 02:58 PM IST
Adah Sharma: జోరుపెంచిన అదా శర్మ.. ‘C.D’ ట్రైలర్‌తో భయపెట్టేందుకు రెడీ

Criminal Or Devil Trailer: ది కేరళ స్టోరీ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ.. పాన్ ఇండియా లెవల్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వరుస సూపర్ హిట్స్‌తో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్న ఈ భామ.. హార్రర్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ సినిమాలతో ప్రయోగాలు చేస్తున్నారు.  తెలుగులో గ్యాప్ తీసుకున్న అదా శర్మ.. ఓ స్ట్రెయిట్ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తుండగా.. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్ఆర్ ధృవన్ మ్యూజిక్ అందించారు. 

Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు..' అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్‌ను నడిపించారు. వరుస మిస్సింగ్ కేసులతో నగరం అంతా రెడ్ అలర్ట్ ఆసక్తికరంగా మార్చారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు..? నా చుట్టూ ఏదో జరుగుతోంది.. ఇన్ని రోజులు తనతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా..? అంటూ భయపెట్టేలా ట్రైలర్ ఉంది. యాక్షన్ సీన్స్‌లో అదా శర్మ అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఫైట్స్‌లో దుమ్ములేపారు. విజువల్స్, ఆర్ఆర్ అన్నీ టాప్ నాచ్‌లో ఉన్నాయి. 

న్యూ వే ఆఫ్‌ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అంటూ రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తోంది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏ.ముద్దు కృష్ట మాటలు అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఎడిటర్‌గా సత్య గిడుతూరి పనిచేశారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. మే 10వ తేదీ నుంచి థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టనుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News