OG: పవన్ అభిమానులకు మరో నిరాశ.. ఇక ఓజి కూడా లేనట్టేనా

Pawan Kalyan: కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ప్రకటించి ఆయన అభిమానులను తెగ ఖుషి చేశారు. అయితే ఆయన ప్రకటించిన సినిమాలు ఒక్కొక్కటిగా ఆలస్యం అవుతూ రావడం ప్రస్తుతం పవన్ అభిమానుల్లో నిరాశను కలగజేస్తున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2023, 07:40 PM IST
OG: పవన్ అభిమానులకు మరో నిరాశ.. ఇక ఓజి కూడా లేనట్టేనా

DVV Entertainments Tweet On OG: రెండు సంవత్సరాలకి ఒక సినిమా చేసే పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే దాదాపు ఒకేసారి నాలుగు సినిమాల్లో సైన్ చేస్తున్నట్టు ప్రకటించి అభిమానులను తెగ ఖుషి చేశారు. అయితే పవన్ ప్రకటించిన సినిమాలలో బ్రో చిత్రం తప్ప మరో ఏ చిత్రం కూడా ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడో మొదలైంది. అయితే ఆ సినిమా అసలు ఏమైపోయిందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దానికి తోడు ఈ మధ్యనే హరిహర వీరమల్లులు ముఖ్యపాత్ర కోసం సైన్ చేసిన బాబి డియోల్.. నేను తెలుగులో ఒక సినిమా ఒప్పుకున్నాను కానీ ఆ చిత్రం ఆగిపోయింది అనే స్టేట్మెంట్ ఇవ్వటంతో.. ఇక ఈ సినిమా లేదన్నట్టే ఫిక్స్ అయిపోయారు దాదాపు సగం జనం. 

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుందడంతో ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వేశారు అభిమానులు. ఇక ఈ చిత్రం కాదు అని హరీష్ రవితేజ తో ఒక సినిమా ఒప్పుకున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులకు మిగిలిన ఒకే ఒక ఆశ ..సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఓజీ. ఈ సినిమా ఫస్ట్ వీడియో గ్లిమ్స్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.

కాగా ఈ చిత్రం తప్పకుండా పవన్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు తెగ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మాత వేసిన ఒక ట్వీట్ వీరిని అయోమయంలో పడేసింది. మొన్నటి వరకు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో డీవీవీ సంస్థ వరుస అప్డేట్లతో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చింది. కొద్ది రోజుల ముందు వరకు ఓజీ సెట్స్ నుంచి వచ్చినన్ని అప్డేట్లు మరేతర సెట్స్ నుంచి రాలేదు. దీంతో అందరూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ మీద ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. గత కొద్ది రోజులు గా ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు.ఫ్యాన్స్ మాత్రం అప్డేట్ కోసం డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్‌కు రిక్వెస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమా  షూటింగ్ జరగడం లేదు..మళ్లీ స్టార్ట్ అయ్యాక అప్డేట్ ఇస్తామని చెబుతూనే వస్తున్నారు ఈ నిర్మాత. ఈ నేపథ్యంలో ఈయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.

‘బర్త్ డే విషెస్‌తో టైం లైన్ ఫుల్ అయిపోయింది.. సాధారణంగానే అభిమానులు అంటే ఫుల్ హంగ్రీతో ఉంటారు.. కానీ మీకు ఇది తెలియాలనే చెబుతున్నాం.. ఇప్పుడు షూటింగ్ జరగడం లేదు.. అందుకే అప్డేట్లు రావాలంటే ఇంకా టైం పడుతుంది.. ఇక్కడ మీరు వెయిట్ చేయకండి.. డోంట్ స్టే ట్యూన్డ్ హియర్’ అని ట్వీట్ వేసింది.

ఇక ఇలాంటి మాటలు ఈ నిర్మాత పెట్టడంతో.. నిజంగానే కొద్ది రోజుల తర్వాత అయినా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా లేదా మిగతా సినిమాల లాగా ఈ సినిమా కూడా ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News