Umapathi: ఉమాపతి ట్రైలర్ విడుదల…ఆకట్టుకున్న గ్రామీణ ప్రేమ కథ

Avika Gor: ప్రేమ కథలు ఎన్నిసార్లు ఎంతమంది తీసిన బోర్ కొట్టవు. కేవలం కథ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆసక్తితో కలిపితే చాలు.. ఆ ప్రేమ కథలు తప్పకుండా సూపర్ హిట్లుగా నిలుస్తాయి. ఇప్పుడు అలానే మనసుని హత్తుకునే ప్రేమ కథతో మన ముందుకు రాబోతున్నారు ఉమాపతి సినిమా యూనిట్..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 06:26 PM IST
Umapathi: ఉమాపతి ట్రైలర్ విడుదల…ఆకట్టుకున్న గ్రామీణ ప్రేమ కథ

Umapathi Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆకట్టుకునే కథనం స్క్రీన్ ప్లే ఉంటే చాలు ప్రేమ కథలు తప్పకుండా సూపర్ హిట్ అవుతాయి. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియెన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ అందమైన ఫీల్ గుడ్ గ్రామీణ ప్రేమ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. 

ఈ ప్రేమ కథ చిత్రంలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే అవికా గోర్ వధువు అనే వెబ్ సిరీస్ తో మనల్ని ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఒక మంచి ప్రేమ కథతో మన ముందుకి రాబోతోంది ఈ చిన్నారి పెళ్ళికూతురు.

క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FaceTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News