Malaika Arora Tummy : ఎందుకు అలా వెనక్కి లాక్కుంటావ్?.. ఊపిరి కూడా పీల్చుకోవా?.. మలైకా వీడియోపై ట్రోల్స్

Malaika Arora Tummy మలైకా అరోరా సోషల్ మీడియాలో ప్రస్తుతలం ట్రోలర్లకు దొరికిపోయింది. ట్రోలర్లను ఆమెను, ఆమె తన పొట్టను వెనక్కి లాగి పట్టుకోవడం, శ్వాస కూడా తీసుకోకుండా అలానే బిగుసుకుని పోవడంతో జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 11:50 AM IST
  • నెట్టింట్లో మలైకా అరోరా సందడి
  • పొట్ట వెనక్కి లాగిన మలైకా
  • నెటిజన్ల ట్రోలింగ్ వైరల్
Malaika Arora Tummy : ఎందుకు అలా వెనక్కి లాక్కుంటావ్?.. ఊపిరి కూడా పీల్చుకోవా?.. మలైకా వీడియోపై ట్రోల్స్

Malaika Arora Tummy Trolls మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఆ సమయంలో మలైకా అరోరా చేసిన చేష్టలు, పొట్టని వెనక్కి లాగి పెట్టుకోవడం, శ్వాస కూడా తీసుకోకుండా పొట్టని వెనక్కి పట్టి ఉంచడంతో జనాలు ట్రోల్ చేస్తున్నారు. .

చల్ చయ్యా చయ్యా అంటూ ఊపు ఊపేసిన మలైకా అరోరా ఇప్పుడు ఇలా తన పొట్టని వెనక్కి లాగేసుకుంటోందని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఎంత సేపు అలానే ఉంటావ్.. ఎంత సేపు ఊపిరి బిగపట్టుకుని ఉంటావ్.. నీ కష్టాలు ఎవ్వరికీ రావొద్దు.. ఆమె ఊపిరి కూడా పీల్చుకోవడం లేదు.. ఫోటోలు అంటూ ఇబ్బంది పెట్టకండి.. వదలేయండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మలైకా, అర్జున్ చాలా కాలం తరువాత ఇలా సోషల్ మీడియాలో కనిపించారు. ఈఇద్దరి డేటింగ్ వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మలైకా వయసు, అర్జున్ కపూర్ ఏజ్ మీద ఎప్పుడూ ట్రోల్స్ జరుగుతుంటాయి. ఈ జోడి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై ఎప్పుడూ ఏదో ఒక ట్రోల్‌ పడుతూనే ఉంటుంది.

మలైకా, అర్జున్ కపూర్ మాత్రం ఇంత వరకు పెళ్లి కబురు ఇంత వరకు చెప్పలేదు. మలైకా పెళ్లిళ్లు, విడాకుల సంగతి తెలిసిందే. మలైకాకు చెట్టంత కొడుకు కూడా ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో సినిమా వార్తల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటాడు.

అర్జున్ చివరగా కుట్టి సినిమాలో కనిపించాడు. మలైకా అయితే సినిమాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మలైకా తన యోగా, వర్కౌట్లు అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫాలోవర్లను ఇన్ స్పైర్ చేస్తూనే ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంత ఫిట్ నెస్ మెయింటైన్ చేయడం గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటారు.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News