Avika Gor Popcorn : ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మేమిద్దరం చాలా ఎంజాయ్‌ చేశాం.. అవికా గోర్

Avika Gor Popcorn హీరోయిన్‌గా అవికా గోర్‌ ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. అయితే మొదటి సారిగా నిర్మాణంలోకి అడుగు పెట్టేసింది. పాప్ కార్న్ సినిమాతో నిర్మాతగా మారింది అవికా గోర్. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 05:54 PM IST
  • రేపే థియేటర్లోకి పాప్ కార్న్
  • నిర్మాతగా మారిన అవికా గోర్
  • సాయి రోనక్‌తో అవికా రొమాన్స్
Avika Gor Popcorn : ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మేమిద్దరం చాలా ఎంజాయ్‌ చేశాం.. అవికా గోర్

Avika Gor Popcorn అవికా గోర్ ఇంత వరకు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అంతకు ముందు సీరియల్‌లో బాలనటిగా మెప్పించింది. అయితే ఇప్పుడు అవికా గోర్ నిర్మాతగా మారింది. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ముర‌ళి గంధం ద‌ర్శ‌క‌త్వంలో భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 10న విడుదల కాబోతోన్న ఈ సినిమాకు అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఈ సినిమా గురించి ఆమె చెబుతూ.. కథ వినడంతోనే ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందట. 90 శాతం లిఫ్ట్ లో జరిగే కథ కావడం, ఓ నటిగా తనకు చాలా చాలెంజింగ్‌గా అనిపించిందని అవికా చెప్పుకొచ్చింది. దాదాపు రెండు గంటలకు పైగా తనని, హీరోని చూస్తూ కూర్చోవాలని, అది చాలా కష్టమని తనకు తెలుసంటూ చెప్పుకొచ్చింది. తానెప్పుడూ చాలెంజెస్‌ తీసుకోవడానికి  సిద్ధంగానే ఉంటానని, అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నట్టుగా తెలిపింది. 

కథ వినగానే, తనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందని, తన పరంగా ఎక్కువ టైమ్‌ ఉంటుందని తెలిసిందట. ఎక్కువగా ఈ సినిమా కోసం అటెన్షన్‌ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైందట. నటిగా  అయితే సెట్‌కి వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తామని, అదే నిర్మాతగా అయితే.. అన్నీ విషయాలనూ పట్టించుకుంటామని చెప్పుకొచ్చింది. తాను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, ఈ సినిమా కథ వినగానే, పర్ఫెక్ట్ టైమ్‌ అనిపించిందట. 

సాయి రోనక్ చాలా మంచి వ్యక్తి. తాము ఇంతకు ముందు హ్యాష్‌ట్యాగ్‌ బ్రో సినిమా చేశామని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు కూడా అతన్ని తానే సజెస్ట్  చేశానని అసలు విషయాన్ని బయటపెట్టేసింది. లిఫ్ట్ సెట్ వేశామని, అక్కడ షూటింగ్ ప్రతిరోజూ కొత్తగా అనిపించేదంటూ అవికా తెలిపింది. 

సెట్లో మంచి ర్యాపో ఉన్న వాళ్లతో చేస్తే పాజిటివ్‌గా అనిపిస్తుందని, ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని, ఆఫ్ స్క్రీన్‌లోనూ తామిద్దరం ఎంజాయ్ చేస్తూ చేశామని సినిమా విశేషాల గురించి అవికా చెప్పుకొచ్చింది. ప్రతీ రోజూ ఉదయం ఐదు గంటలకే తామిద్దరం సెట్‌లో ఉండేవాళ్లమని చెప్పుకొచ్చింది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News