Kalyaan Dhev Post : నాకు F అనే వర్డ్‌లో అది చాలా ఇష్టం.. కళ్యాణ్‌ దేవ్ నాటీ పోస్ట్‌.. కుర్ర హీరోయిన్ రిప్లై వైరల్

Kalyaan Dhev Bold And Funny Post కళ్యాణ్‌ దేవ్ తాజాగా ఓ ఫన్నీ పోస్ట్ వేశాడు. దీనిపై అవికా గోర్ ఫన్నీగా రియాక్ట్ అయింది. దీంట్లో కళ్యాణ్ దేవ్ చేసిన ఎఫ్ కామెంట్ అందరినీ నవ్వించేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 07:14 AM IST
Kalyaan Dhev Post : నాకు F అనే వర్డ్‌లో అది చాలా ఇష్టం.. కళ్యాణ్‌ దేవ్ నాటీ పోస్ట్‌.. కుర్ర హీరోయిన్ రిప్లై వైరల్

Kalyaan Dhev Post : కళ్యాణ్‌ దేవ్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నాడు. ఆ మధ్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చాడు. గత ఏడాది ఇదే సమయంలో కళ్యాణ్‌ దేవ్ సైలెంట్‌గా ఉన్నాడు. మెగా ఈవెంట్లలో కనిపించే వాడు కాదు. తన సినిమాలకు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చేది కాదు. అలా కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగినట్టు అందరికీ అనిపించింది.ఇక శ్రీజ తన ఇన్ స్టా హ్యాండిల్‌లో పేరు మార్చుకోవడంతో విడాకుల రూమర్లు ఎక్కవయ్యాయి.

అలా కళ్యాణ్‌ దేవ్ శ్రీజ కొణిదెల మధ్య విడాకుల విషయం మీద ఎన్నెన్నో కథనాలు వస్తున్నాయి. కానీ ఇంత వరకు కూడా ఈ ఇద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. అసలు వారిద్దరి మధ్య ఏం జరుగుతోందో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మధ్యలో అయితే కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను కూడా చూసుకోలేకపోయాడు. దూరంగానే ఉన్నట్టు కనిపించింది. ప్రస్తుతం నవిష్కతో ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలు అయితే షేర్ చేస్తున్నాడు. కానీ శ్రీజ, శ్రీజ పెద్ద కూతురు నివృత్తిలతో మాత్రం దూరంగానే ఉంటున్నట్టున్నాడు.

కళ్యాణ్‌ దేవ్ చేసిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు విడుదలైనా కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. కళ్యాణ్‌ దేవ్ శ్రీజ మధ్య గ్యాప్ ఉందని అందరికీ అక్కడే అర్థమైంది. ఇక శ్రీజ కళ్యాణ్ అని ఉన్న పేరుని శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. దీంతో రూమర్లు మరింతగా బలపడ్డాయి. ఇంత వరకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇలా అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి.

కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన లైఫ్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్లకు వెళ్తున్నాడు. అలా పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా ఎఫ్ అనే పదం గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఎఫ్ అనే పదాల్లో ఇష్టమైన రెండో పదం ఫ్రైడే అని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై అవికా గోర్ స్పందించింది. ఫస్ట్ పదం ఫుడ్? కదా? అని అనేసింది. నా గురించి అంతా కూడా నీకు తెలుసు కదా? అని కళ్యాణ్‌ దేవ్ నాటీగా స్పందించాడు. ఇక మరి కళ్యాణ్ దేవ్‌కు నచ్చిన మొదటి ఎఫ్ పదం ఏంటో?. 

Also Read :  Balakrishna Tongue Slip: బాలయ్య నోటి వెంట బూతు మాట.. పాపం నోరు జారాడుగా!

Also Read : Samantha Ruth Prabhu Bold Pics : సమంత గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన సాధన సింగ్.. సామ్ ఫ్రెండ్‌పై నెటిజన్ ఫైర్.. రిప్లై హైలెట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News