Vishwak Sen : ప్రభాస్ ముందు విశ్వక్ సేన్ వంటి యువ హీరో నిలబడగలడా?

Prabhas : యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు డిసెంబర్ 24 కానీ డిసెంబర్ 29 గాని ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమా కూడా అదే సమయంలో విడుదల కాబోతోంది. మరి ప్రభాస్ ముందు విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్ద తట్టుకొని నిలబడగలడా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 11:09 AM IST
Vishwak Sen : ప్రభాస్ ముందు విశ్వక్ సేన్ వంటి యువ హీరో నిలబడగలడా?

Box Office : ఈ మధ్యనే మాస్ కా దాస్ అనే సినిమాతో కనిపించిన యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు గాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఆగస్టు లోనే విడుదల కావాల్సింది కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

కానీ ఇప్పుడు ఈ సినిమా మరొకసారి వాయిదా పడినట్టు విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పుడు సినిమా విడుదల తేదీ కోసం రెండు డేట్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఈ ఏడాది డిసెంబర్ 24 కాగా మరొకటి డిసెంబర్ 29. కానీ డిసెంబర్ 22న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా కూడా విడుదల కాబోతోంది.

ప్రశాంత్ నీలి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అదే సమయంలో విడుదలయితే ఒకవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమా ముందు విశ్వక్ సేన్ వంటి యువహీరో సినిమాకి ఆదరణ లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.

గాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర బృందం ఇంకా ఈ రెండు తేదీల్లో ఒక తేదీని ఫిక్స్ చేయాల్సి ఉంది. ఒకవేళ డిసెంబర్ లో విడుదల చేయలేకపోతే జనవరిలో ఇప్పటికే చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సమయంలో మంచి స్లాట్ దొరకకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

డిసెంబర్ 8న విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు వాయిదా పడుతుంది అంటేనే విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్రస్టేషన్ ని బయటపెట్టారు. ఒకవేళ డిసెంబర్ లో సినిమా విడుదల కాకపోతే ఇక ఎప్పుడు విడుదలైనా కూడా చిత్ర ప్రమోషన్స్ లో తాను పాల్గొనలేను అని నిర్మోహమాటంగా చెప్పేశారు విశ్వక్. శ్రీకర ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

.

Trending News