Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Unknown Facts about sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Last Updated : Oct 15, 2022, 08:36 AM IST
Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Unknown Facts about sai Dharam Tej Birthday Special Story: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరంతేజ్ ముందుగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రేయ్ అనే సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2013 వ సంవత్సరంలో పూర్తయినా సరే ఆర్థిక ఇబ్బందులతో సినిమా 2017 వరకు విడుదల కాలేదు. ఆయన మొదటి సినిమాగా పిల్ల నువ్వు లేని జీవితం సినిమా విడుదలైంది, అలా ఆ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సాయి ధరంతేజ్ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో మంచి హీరోగా నిలబడ్డాడు.

తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యు ఇలా వరుస డిజాస్టర్ ఫలితాలు అందుకున్నా చిత్రలహరి సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు. తర్వాత ప్రతిరోజూ పండుగ సినిమాతో పర్వాలేదనిపించుకున్నా సోలో బతుకే సో బెటరూ రిపబ్లిక్ సినిమాలతో ఇబ్బంది పడ్డాడు. అయితే రిపబ్లిక్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఒకరకంగా చాలా కాలం పాటు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడని చెప్పాలి.

ఆయన మళ్ళి కోలుకుంటాడా లేదా అనే విషయం మీద అందరిలోనూ ఉన్న అనుమానాలను దూరం చేస్తూ ఎట్టకేలకు ఆయన కోలుకుని ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో సాయంత్రం తేజ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

తమిళ్లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు సాయిధరమ్ తేజ్ 130 కేజీల దాకా బరువు ఉండేవాడు సినిమాల కోసమే ఆయన స్లిమ్ గా హీరో లుక్ లోకి మారారు. సాయిధరమ్ తేజ్ కి ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. సాయిధరమ్ తేజ లైఫ్ లో ఫస్ట్ బైక్ పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చిందే. సాయిధరమ్ తేజ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ గదికి ఒక వార్నింగ్ పోస్టర్ ఉంటుంది.

ఈ రూమ్ ఒక డిజాస్టర్ ఏరియా అని ఆ పోస్టర్ మీద ప్రచురించి ఉంటుంది. ఇక చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తితో మ్యూజిక్ టేప్స్ అలాగే మ్యూజిక్ సీడీస్ ని సాయిధరమ్ తేజ్ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. తన మేనమామల లాగానే సాయిధరమ్ తేజ్ కూడా ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సాయి ధరంతేజ్ కి ఆల్ టైం ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటారు.

ఇక సాయిధరమ్ తేజ్ కి పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన నెలకు 75 లక్షలు దాకా సంపాదిస్తూ ఉంటారు, ఇప్పటిదాకా 88 కోట్లు తన స్వార్జితం వెనకేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు జీ తెలుగు న్యూస్ టీమ్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. 

Also Read: Chiranjeevi Hot Comments: వెనక్కి తగ్గడం కాదు.. ఎందుకు ఉలిక్కిపడాలి?.. గరికిపాటి ఇష్యూపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Also Read: Rukshar Dhillon Hot Photos: బికినీలో నాని హీరోయిన్ హాట్ ట్రీట్.. ప్రకృతి ఒడిలో సోయగాల వల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News