Harish Shankar:శ్రుతిహాసన్, పూజా హెగ్డేకి నాపై నమ్మకం ఉంది.. రూమర్స్‌పై హరీష్ శంకర్ ట్వీట్

Ravi Teja: పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్.. రవితేజాతో మిరపకాయ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మరోసారి ఈ ఇద్దరు హీరోలతోనే తన సినిమాలు ప్లాన్ చేసుకోగా.. ఈసారి మాత్రం ఈ ప్రాజెక్టులకు ఎక్కడ చూడు అడ్డంకులే కనిపిస్తున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 07:35 AM IST
Harish Shankar:శ్రుతిహాసన్, పూజా హెగ్డేకి నాపై నమ్మకం ఉంది.. రూమర్స్‌పై హరీష్ శంకర్ ట్వీట్

Harish Shankar Viral Tweet: దాదాపు పవన్ కళ్యాణ్ కి 10 సంవత్సరాల పాటు సూపర్ హిట్ లేకపోతే.. ఆయనకు ఏకంగా గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. హిందీ దబాంగ్ సినిమాని తెలుగులో రీమేక్ చేసి పవర్ స్టార్ కి సూపర్ హిట్ అందించారు. కాగా రవితేజ షాక్ సినిమాతో మనకు పరిచయమైన హరీష్ శంకర్.. మొదటి సినిమాతో హిట్ అందుకోలేక పోయినా ఆ తరువాత మనం మాస్ మహారాజా కి మిరపకాయ లాంటి సూపర్ హిట్ ని అందించారు.

ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో ఉస్తాడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేశారు హరీష్. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే వచ్చింది. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడో విడుదలైన విజయ్ చిత్రం తేరి కి రీమేక్ అని ప్రచారం కొనసాగింది. దాంతో నేటిజన్స్ హరీష్ ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. కాగా తనెంతో సినిమాతో చూపిస్తాను అంటూ హరీష్ దానికి రిప్లై ఇచ్చారు. అయితే అనుకోని కారణాలవల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్టు రవితేజతో ఈ మధ్యనే ప్రకటించేసారు హరీష్ శంకర్. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ కి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చేశారు హరీష్.

"రవితేజ- హరీశ్ శంకర్ సినిమా రైడ్ రీమేక్.. ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్లను అనుకోగా… అందులో మొదట మీనాక్షి చౌదరీని మేకర్స్ సంప్రదించారట. కానీ డేట్స్ విషయంలో సమస్యల కారణంగా మీనాక్షి నో చెప్పేసింది. మేకర్స్ చెప్పిన రెమ్యునరేషన్ నచ్చక సీనియర్ బ్యూటీ ఇలియానా కూడా నో చెప్పింది. ఇక తాజాగా చిత్రబృందం యానిమల్లో యాక్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ తృప్తిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు అని టాక్” అంటూ పలు సోషల్ మీడియా పేజీలు ట్వీట్ వేయడం మొదలుపెట్టాయి.

ఇక ఇదే ట్వీట్ ని షేర్ చేస్తూ మరీ సమాధానమిచ్చేశారు దర్శకుడు. "ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. శృతి హాసన్‌ లేదా పూజాహెగ్డే.. నా ట్రాక్‌ రికార్డ్‌ తెలిసిన వారందరికీ నా సినిమాల ఎంపికపై చాలా నమ్మకం ఉంది. ఇలాంటి పుకార్లను ఎవరూ స్ప్రెడ్ చేయొద్దు. యానిమల్ మూవీ కన్నా ముందే నా మూవీ క్యాస్టింగ్ కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్నే అడగండి. క్లియర్ చేస్తా" అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈ డైరెక్టర్.

కాగా ఎప్పుడు 2018లో అజయ్ దేవగణ్, ఇలియానా నటించిన హిందీ సూపర్ హిట్ చిత్రం రైడ్‌ కి ఈ మూవీ రీమేక్‌ గా ఈ సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే కనీసం ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకన్నా వేచి చూడాలి.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News