రొమాంటిక్‌ టచ్‌తో 'నా నువ్వే' ట్రైలర్

ఎంఎల్ఏ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సినిమా నా నువ్వే.

Last Updated : May 16, 2018, 06:17 PM IST
రొమాంటిక్‌ టచ్‌తో 'నా నువ్వే' ట్రైలర్

ఎంఎల్ఏ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సినిమా నా నువ్వే. జోగేంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తోంది. రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే రిలీజైన సాంగ్ టీజర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. ఇదిలావుండగా తాజాగా నా నువ్వే సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాతలు. ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న పాత్రలో తమన్నా కనిపించనుండగా అప్పుడు ఆమెను పట్టించుకోని కల్యాణ్ రామ్ ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో కనిపించనున్నాడని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. నా నువ్వే సినిమా నేపథ్యానికి తగినట్టుగానే రొమాంటిక్‌గా వున్న ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి మరి.  

 

కల్యాణ్ రామ్, తమన్నా వంటి ఆసక్తికరమైన కాంబోకు తోడు ప్రముఖ నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం. 

Trending News