Katrina Kaif Death Threats: చంపేస్తానంటూ.. కత్రినా కైఫ్‌కు బెదిరింపులు! మరోసారి ఉలిక్కిపడ్డ బాలీవుడ్

Katrina Kaif and Vicky Kaushal receive death threats. బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశ‌ల్‌, కత్రినా కైఫ్‌కు తాజాగా చంపేస్తానంటూ బెదిరింపులు వ‌చ్చాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 25, 2022, 02:20 PM IST
  • కత్రినా కైఫ్‌కు బెదిరింపులు
  • మరోసారి ఉలిక్కిపడ్డ బాలీవుడ్
  • గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు
Katrina Kaif Death Threats: చంపేస్తానంటూ.. కత్రినా కైఫ్‌కు బెదిరింపులు! మరోసారి ఉలిక్కిపడ్డ బాలీవుడ్

Katrina Kaif, Vicky Kaushal receive death threats: బెదిరింపులతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని వచ్చిన బెదిపింపులను మరువక ముందే.. మరోసారి చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశ‌ల్‌, కత్రినా కైఫ్‌కు తాజాగా బెదిరింపులు వ‌చ్చాయి. ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి సోష‌ల్ మీడియా ద్వారా వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయింది.

గత ఏడాది డిసెంబర్‌లో బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి వేడుక అనంతరం హనీమూన్ వెళ్లొచ్చిన ఈ సార్ట్ జంట అటు ఫిల్మ్ కెరీర్‌.. ఇటు మ్యారీడ్ లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. కత్రినా బర్త్‌ డే సందర్భంగా మాల్దీవులకు కూడా వెళ్లారు. అక్కడే గ్రాండ్‌ పార్టీ చేసుకున్నారు. ఇటీవల కాట్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో బెదిరింపుల రూపంలో అలజడి రేగింది. 

కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్‌ జోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరింపులు వచ్చాయి. ఓ ఆగంతకుడు ఇద్దరిని చంపేస్తా అంటూ కత్రినకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కత్రినా, విక్కీలు ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506-II మరియు 354-డి కింద అతడిపై కేసు నమోదు చేయబడింది.

Also Read: Condom Addiction: కండోమ్ నీళ్లు తాగుతున్న కాలేజీ స్టూడెంట్స్.. దానికోసం మాత్రం కాదట! విషయం తెలిస్తే బిత్తరపోతారు  

Also Read: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News