Katrina Kaif: సవాల్ నుంచి పారిపోవద్దు.. 'టైగర్ 3'లో టవల్ ఫైట్‌పై కత్రినా కామెంట్స్

Katrina Kaif Towel Fight: సల్మాన్ ఖాన్ టైగర్-3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోవడంత్ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినీ ప్రేక్షకులు కత్రినా కైఫ్ టవల్ ఫైట్ చూడాలని ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. తాజాగా ఈ ఫైట్‌పై కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని రాసుకొచ్చింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2023, 10:42 PM IST
Katrina Kaif: సవాల్ నుంచి పారిపోవద్దు.. 'టైగర్ 3'లో టవల్ ఫైట్‌పై కత్రినా కామెంట్స్

Katrina Kaif Towel Fight: యాక్షన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'టైగర్ 3'. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైలర్‌లో కత్రికా టవల్ ఫైట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెన్స్ కోసం తాను ఎంతగా కష్టపడిందో తెలియజేస్తూ కత్రినా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. 

'టైగర్ 3' సినిమా తన ఓర్పును పరీక్షించిందని, తనలోని బలాన్ని కనుగొనేలా చేసిందని కత్రికా కైఫ్ తెలిపింది. తనని తాను ఒక టైగర్‌గా పేర్కొంది. "పెయిన్ అనేది మరొక సంచలనానికి దారి తీస్తుంది. నొప్పి నుంచి పారిపోవద్దు. దానికి గురించి భయపడవద్దు. నేను గతంలో చాలాసార్లు అలసిపోయాను కానీ, ఈసారి మాత్రం భిన్నంగా కాస్త కఠినంగా అనిపించింది. నాకు ఎంతో నొప్పి కలిగనా.. నేన్ను దాన్ని సవాలుగా తీసుకున్నాను. కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాను. నిబద్ధతతో చేసే ఏ పనైనా విజయాన్ని అందిస్తుందని నమ్ముతాను. గతంలో కంటే మరింత డైనమిక్ యాక్షన్‌ను ప్రేక్షులకు ఈ చిత్రం అందిస్తుందని  నేను భావిస్తున్నాను. 'టైగర్ 3' సినిమా విడుదల కోసం ఆతృతగా వేచి చూస్తున్నాను.." అని  కత్రినా రాసుకొచ్చింది. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'ఏక్తా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాలకు కొనసాగింపుగా 'టైగర్ 3' తెరకెక్కుతోంది. అవినాష్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా రోల్‌లో కత్రినా కైఫ్ కనిపించనున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నారు. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్స్ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'టైగర్ 3' చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదల చేయబోతున్నారు. ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలా బ్లాస్ట్ అవుతుందో, ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జైలు నుంచే పాలన సాగిస్తారా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News