Mahesh Babu - Rajamouli: ఆ నెలలోనే ప్రారంభం కానున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా..

ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత రాజమౌళి మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ - మహేష్ బాబు తీస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేశారట..! ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2023, 05:31 PM IST
Mahesh Babu - Rajamouli: ఆ నెలలోనే ప్రారంభం కానున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా..

Mahesh Babu - Rajamouli Combo: మహేష్ బాబు.. ఈ పేరు  గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ముఖ్యంగా మన దక్షిణాది ప్రజలకు సుపరిచితుడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు  పాన్ ఇండియా హీరో గా మారి బాలీవుడ్ లో అడుగు పెట్టపోతున్నాడనే విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకి రాజమౌళి  తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశాడు. 

రాజమౌళి తో సినిమా అంటే చాలా సాహసం తో కూడిన పని అందులోను మహేష్ బాబు  రాజమౌళి తో మొదటి సినిమా కాబట్టి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్  కోసం రాజమౌళి ముందుగానే మూడు నెలల టైం అడిగారట. కానీ ప్రస్తుతం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని.. మహేష్ బాబు అనుకుంటున్నాడంట. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. 

అలాగే రాజమౌళి తో సినిమా ఆగష్టు లో ముహూర్తం స్టార్ట్ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా యాక్షన్ మరియు అడ్వెంచర్ తో కూడిన చిత్రం. ఈ  చిత్రంలో బాలీవుడ్ నటీనటులుతో పాటు హాలీవుడ్ నటులు కూడా నటించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందట. రాజమౌళితో సినిమాకి చాలా సమయం పడుతుంది కాబట్టి  మహేష్ బాబు తన డేట్స్  లో కంప్రమైస్ అయ్యారని టాక్. ఈ సినిమాపై అటు దేశం వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యూనేషన్ విషయానికి వస్తే.. బాగానే తీసుకున్నారని టాక్. 

Also Read: World Cup 2023: ఈ స్టార్ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్..!  

రాజమౌళి సినీ ప్రస్థానం చుస్తే.. తాను తీసిన ప్రతి సినిమా ఒక దాని కంటే మరొకటి చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెల్సిందే! ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాకి గ్లోబల్ అవార్డు మరియు ఈ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. రాజమౌళి మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా భారీ బడ్జెట్ నిర్మించబోతున్నటు చిత్రబృందం స్పష్టం చేసింది.

మహేష్ బాబు కూడా గుంటూరు కారం సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. గుంటూరు కారం సినిమా యాక్షన్ అండ్ ఫ్యామిలీ  డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ కానీ.. స్టైల్ కానీ ఇది వరికి సినిమాల కన్నా డిఫెరెంట్ గా ఉండనుందని సమాచారం. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమా కోసమే గుంటూరు కారం సినిమా షూటింగ్ షరా వేగంగా ముగించేశారట!. హారిక &హాసిని క్రియేషన్ నిర్మిస్తున్న గుంటూరు కారం సినిమా టీజర్ అంచనాలకు మించి యూట్యూబ్ లో 3. 2 క్రోర్ వ్యూస్ సాచించిన సంగతి తెల్సిందే!

Also Read: Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై దుమారం, వాలంటీర్లపై జనసేనాని వ్యక్తిగత ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News