Pawan Kalyan's Remake Movie : ఆగిపోయిన పవన్ రీమేక్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

Makers Clarity on Pawan Kalyan's Vinodhaya Sitham remake: పవన్ కీలక పాత్రలో నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ సినిమా ఆగిపోయిందని అంటూ జరుగుతున్న ప్రచారం మీద నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 12, 2022, 05:40 PM IST
Pawan Kalyan's Remake Movie : ఆగిపోయిన పవన్ రీమేక్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

Makers Clarity on Pawan Kalyan's Vinodhaya Sitham remake: ఒకపక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో రెండు పడవల మీద కాలు వేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెలలో హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక వర్క్ షాప్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఈ వర్క్ షాప్ లో పవన్ కూడా పాల్గొంటున్నాడు. ఆ వర్క్ షాప్ నుంచి ఒక ఫోటో రిలీజ్ చేయగా అది వెంటనే వైరల్ అయింది.

ఇక ఆ సినిమాల సంగతి పక్కన పెడితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు. ఇది కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేశారు, అలాగే సుజిత్ డైరెక్షన్లో ఒక సినిమా కూడా ప్లాన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇవి కాకుండా చాలా తక్కువ సమయంలో షూటింగ్ జరిపే విధంగా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరంతేజ నటించబోతున్నారు ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే జరిగాయి. కానీ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయం మీద క్లారిటీ లేదు. తాజాగా సమాచారం మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసమే సినిమా యూనిట్ ఎదురుచూస్తోందని, సాయిధరమ్ తేజ అయితే ఎప్పుడు సినిమా షూటింగ్ చెప్పినా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే హరీష్ శంకర్ సినిమా, సుజిత్ సినిమాలో కూడా ఆయన నటించాల్సి ఉండడంతో ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో వినోదయ సిత్తం నిలిచిపోయిందంటూ ప్రచారం మొదలయింది. ఇక ఈ నేపథ్యంలో అది నిజం కాదని సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. అయితే ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుంది అనే విషయం మీద మాత్రం వారు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమాని తమిళంలో డైరెక్షన్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ సినిమా నిర్మితమవుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించబోతోంది.

Also Read: Telugu Movies Releasing this week: ఓటీటీలో, థియేటర్లో రిలీజవుతున్న తెలుగు సినిమాలివే!

Also Read: Vignesh Shivan on Surrogacy: సరోగసీ కామెంట్లపై స్పందించిన విగ్నేష్ శివన్.. అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ కామెంట్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News