Malaika Arora Engagement: మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగిందా, హాట్ టాపిక్‌గా మారిన డైమండ్ రింగ్

Malaika Arora Engagement | బి టౌన్, ముంబైలో గత కొన్నేళ్లుగా ఐటమ్ గాళ్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ ప్రమాయాణం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటోంది. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో , అనంతరం సైతం వీరి అప్‌డేట్స్ కోస బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 14, 2021, 01:27 PM IST
Malaika Arora Engagement: మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగిందా, హాట్ టాపిక్‌గా మారిన డైమండ్ రింగ్

Malaika Arora Engagement Rumours : బాలీవుడ్ ప్రేమపక్షులు మలైకా అరోరా, అర్జున్ కపూర్ తమ లేటెస్ట్ ఫొటోలతో సందడి చేస్తున్నారు. బి టౌన్, ముంబైలో గత కొన్నేళ్లుగా ఐటమ్ గాళ్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ ప్రమాయాణం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటోంది. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో , అనంతరం సైతం వీరి అప్‌డేట్స్ కోస బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూసింది. తాజాగా వీరికి సంబందించిన విషయం హాట్ టాపిక్ అవుతోంది.

మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరంపై భారీగా కామెంట్లు వస్తున్నాయి. డైమండ్ రింగ్ చూసిన నెటిజన్లు, ఆమె ఫాలోయర్లు మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ల నిశ్చితార్థం జరిగిపోయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కోరుకున్న ఉంగరం చేతికి వచ్చింది. నేను చాలా ప్రేమిస్తున్నాను. సంతోషం ఇక్కడ ఇలా మొదలైంది. నిశ్చితార్థపు ఉంగారాలంటే చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని సాధ్యమైనంత చిన్నగా, నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇది నిజంగానే అద్బుతం కాదా అంటూ మలైకా అరోరా(Malaika Arora) తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 

Also Read: Malaika Arora to tie knot: రెండో పెళ్లికి సిద్ధమైన మలైకా అరోరా

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

గత ఏడాది తొలుత బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ఆపై మూడు, నాలుగు రోజులకే మలైకా అరోరాకు కరోనా సోకగా, కొన్ని రోజులచికిత్స అనంతరం ఆమె కోలుకుంది. ఈ ఐటమ్ గాళ్ ఇటీవల తొలి కరోనా టీకా తీసుకుంది. దివ యోగా సెంటర్ నిర్వహిస్తోన్న మలైకా అరోరా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, అందుకు యోగా, ఇతర శారీరక వ్యాయామాలు చేయాలని సలహాలిస్తోంది. తాజాగా ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ లవ్ సింబల్ పోస్టులు చేయడంతో అర్జున్ కపూర్‌(Bollywood)తో ఎంగేజ్‌మెంట్ జరిగిందా అనే టాక్ వినిపిస్తోంది.

Also Read: EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News