Naga Chaitanya: డిజాస్టర్ నటితో నాగచైతన్య…10 సంవత్సరాల తరువాత మళ్ళీ!

Pooja Hegde: స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన పూజ హెగ్డే ఇప్పుడు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతోంది తగ్గిపోయాయి అనుకుంటున్నా సమయంలో ఈమెకు నాగచైతన్య తో నటించే అవకాశం వచ్చింది. గతంలో ఒక లైలా కోసం సినిమాలో జంటగా నటించిన వీరు మరొకసారి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2024, 05:12 PM IST
Naga Chaitanya: డిజాస్టర్ నటితో నాగచైతన్య…10 సంవత్సరాల తరువాత మళ్ళీ!

Naga Chaitanya Upcoming Movie: నిన్న మొన్నటి దాకా స్టార్ హీరోయిన్ల జాబితాలో ముందే ఉన్న పూజా హెగ్డే పేరు ఈ మధ్య టాలీవుడ్ లో పెద్దగా వినిపించడం లేదు. ఈమధ్య వరుస డిజాస్టర్లు అందుకున్న పూజ హెగ్డే కి ఇప్పుడు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. గుంటూరు కారం సినిమా నుంచి స్వయంగా తప్పుకున్న పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు.

ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ హెగ్డే కి తాజాగా టాలీవుడ్ నుండి పెద్ద ఆఫర్ వచ్చింది అని తెలుస్తుంది. స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాకపోయినా ఈ సినిమా ఆమె కెరియర్ కి బాగానే ఉపయోగపడుతుంది అని అభిమానులను కూడా అనుకుంటున్నారు.

ఇంతకీ పూజ హెగ్డే కి అవకాశం ఇచ్చింది మరెవరో కాదు నాగ చైతన్య. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు ఇప్పుడు నాగచైతన్య తో ఒక సినిమా చేస్తున్నారు అని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. నాగచైతన్య, పూజ హెగ్డే 2014లో ఒక లైలా కోసం అనే సినిమాలో కూడా నటించారు. నిజానికి పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాతోనే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వకపోయినప్పటికీ ఆమెకు మంచి ఆఫర్లను తెచ్చి పెట్టింది. 

మరి దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ నాగ చైతన్య తో నటించడానికి రెడీ అయింది బుట్ట బొమ్మ. మరి ఈసారి కూడా చై తో సినిమా పూజ హెగ్డే కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నాగచైతన్య త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే లోపు కార్తీక్ దండు తో చై సినిమా గురించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News