Pawan Kalyan OG - Emran Hashmi First Look: పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి ఇమ్రాన్ హష్మీ లుక్ విడుదల..

Pawan Kalyan OG - Emran Hashmi First Look: పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఏపీలో జరగబోయే ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. కానీ ఈయన యాక్ట్ చేస్తోన్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు చిత్రాలున్నాయి. అందులో ఓజీ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి ఎమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2024, 02:23 PM IST
Pawan Kalyan OG - Emran Hashmi First Look: పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి ఇమ్రాన్ హష్మీ లుక్ విడుదల..

Pawan Kalyan OG - Emran Hashmi First Look: ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన ఏపీలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈయన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ఆగడం లేదు. రీసెంట్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్‌ పార్టీ జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును హైలెట్ చేస్తూ ఉన్న ప్రోమో పవన్ కళ్యాణ్‌ అభిమానులకు పూనకాలు తెప్పించింది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఈ టీజర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ ప్రోమో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో  'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తోన్న మరో చిత్రం 'ఓజీ'. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ ఓం భాయ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. మరి ఆ డేట్‌కు ఈ సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.  మరి తెలుగులో ఈయన మొదటి చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఈయన‌ గతేడాది 'బ్రో' మూవీతో పలకరించాడు. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమాను దీపావళి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా 4 భాషలకు సంబంధించిన దాదాపు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి.

Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News