Trivikram Srinivas: అప్పట్లో పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్..

Guntur Kaaram: ప్రస్తుతం జనరేషన్ కి పవర్ స్టార్, సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు. స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరూ ఇప్పుడు ఒక సినిమా కోసం ఏకం కావడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 09:59 AM IST
Trivikram Srinivas: అప్పట్లో పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్..

Pawan Kalyan for Mahesh Babu: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా లేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి వస్తుంది మరో వార్త ఇప్పుడు అంచనాలను మరింత పెంచేసింది.

అదేమిటి అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా భాగమంట.‌ అవును మీరు విన్నది నిజమే త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్లోజ్ రిలేషన్షిప్ మనందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం చిత్రంలో హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే.. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఒక సినిమా కోసం కలవడం ఇది మొదటిసారి కాదు.

ఇంతకుముందు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరి ఆ రుణం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీర్చుకుంటున్నారు ఏమో తెలియదు కానీ.. మొత్తానికి ఇప్పుడు అదే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మహేష్ బాబు సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ విషయం విని వీరిద్దరి అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య స్నేహం స్నేహం నిన్న మొన్న ప్రారంభం అయ్యింది కాదు.ఎప్పుడో మహేష్ బాబు అర్జున్ సినిమా నుండే ఉంది.అప్పట్లో అర్జున్ సినిమా పైరసీ అయితే టాలీవుడ్ లో అందరి హీరోల కంటే ముందు పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు తో పాటు ప్రెస్ మీట్ కి వచ్చి కూర్చొని సపోర్ట్ చేసాడు. ఆ సహాయం తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఇప్పటికే చాలాసార్లు మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత జల్సా సినిమాతో మరింత దగ్గరైన వీరి ఫ్రెండ్ షిప్ ఇప్పుడు గుంటూరు కారంతో మరోసారి తెరపైన కూడా కనిపించనుంది.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News