Salaar: క్లాస్ లుక్ లో ప్రభాస్.. సంబరపడిపోతున్న డార్లింగ్ అభిమానులు

Prabhas: ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ కనిపించే మన ప్రభాస్.. సలార్ ప్రమోషన్స్ కోసం కూల్ లుక్ లో డార్లింగ్ గా కనిపించడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 09:16 PM IST
Salaar: క్లాస్ లుక్ లో ప్రభాస్.. సంబరపడిపోతున్న డార్లింగ్ అభిమానులు

Prabhas Viral Photo: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్  కాంబినేషన్‌లో వస్తున్న ‘సలార్’ సినిమా మొదటి భాగం డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది‌. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చేయట్లేదు ఈ చిత్ర మేకర్స్. అందుకు కారణాలు తెలియకపోయినా ప్రభాస్ అభిమానులు మాత్రం ఎటువంటి పబ్లిసిటీ లేకుండా కూడా తమ హీరో బ్లాక్ బస్టర్ అందుకోగలరు అనే నమ్మకంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తన అభిమానులను ఖుషీ చెయ్యడానికి ప్రభాస్ రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని సలార్ ప్రమోషన్స్ వేగవంతం చేయాలి అని అనుకుంటున్నాట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తో అలానే ఈ చిత్ర యూనిట్ ఇక ఈ సినిమా మొదటి టికెట్ తీసుకున్న రాజమౌళితో ..దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఎప్పుడు రఫ్ అండ్ తప్పక కనిపించే ప్రభాస్ ఈ ఫోటోలు చాలా కూల్ గా క్లాస్ లుక్ తో కనిపివ్వడంతో డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కూలింగ్ గ్లాసెస్ వేసుకొని‌.. వైట్ టీ షర్ట్ ధరించి.. కూల్ గా నవ్వుతూ ప్రభాస్ తళుక్కుమన్న ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారిపోయింది.

మరోపక్క ప్రభాస్ పెద్దగా కనిపించక పోయినా పృథ్వీరాజ్ మాత్రం ఈ చిత్రం కోసం అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.సలార్ సినిమాలో ప్రభాస్- పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వరదరాజ్ మన్నార్ అనే పాత్రలో కనిపించనున్నారు. తనకు ప్రభాస్ దేవుడిలా కనిపిస్తారని, ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని ఈరోజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు  పృథ్వీరాజ్‌. ఇక పృథ్వీరాజ్ తో ప్రభాస్ ఫోటో అలానే ప్రభాస్ గురించి పృథ్వీరాజ్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News