SSMB29 : మహేష్ బాబు కోసం ప్యాన్ ఇండియా నటుడు…రాజమౌళి మాస్టర్ ప్లాన్

SSMB29 Update: మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి ఒక్కో అప్ డేట్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసమే ఇప్పుడు ఒక షాకింగ్ వార్త ఇండస్ట్రీ లో వినిపిస్తూ ఉంది. ఇంతకీ విషయం ఏమిటి అంటే సినిమాలో విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ఒక స్టార్ హీరోను రంగంలోకి దింపేసారట. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 19, 2024, 11:45 AM IST
SSMB29 : మహేష్ బాబు కోసం ప్యాన్ ఇండియా నటుడు…రాజమౌళి మాస్టర్ ప్లాన్

Mahesh Babu-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది జక్కన్న రాజమౌళి కాబట్టి.. సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ సినిమా గురించి అప్డేట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.

తాజాగా రాజమౌళి మహేష్ బాబు కాంబో లో వస్తున్న సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సినిమాలో ఒక కీలకమైన విలన్ పాత్ర కోసం రాజమౌళి మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసిన నటుడు ప్రిత్వీరాజ్ సుకుమారన్ చోటేమియా బడేమియాలో కూడా చేశారు. కానీ అది దారుణంగా డిజాస్టర్ అవ్వడంతో ఇది  ఎవరూ పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే మాత్రం పృథ్విరాజ్ డేట్లు ఇవ్వకుండా ఉంటాడా. కాకపోతే అధికారికంగా చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో అనే విషయం మీద క్లారిటీ రాదేమో.

ఈ నెల 31 అంటే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 20ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చని సమాచారం. మహేష్ బాబు ఓట్ వేయడానికి వెళ్లినపుడు సినిమాకోసం మహేష్ ప్రత్యేకంగా మార్చుకున్న హెయిర్ స్టైల్ కూడా జనంలోకి బాగానే వెళ్లిపోయింది. 

సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రాజమౌళి ఎంత సీక్రెట్ గా ఉంచాలి అని ట్రై చేసినా కూడా ఏదో ఒక రూపంలో అవి బయటకి లీక్ అయ్యి వైరల్ అవుతునేఉన్నాయి. ఈ మధ్యనే సినిమా గురించి ఒక ఫేక్ క్యాస్టింగ్ కాల్ హల్చల్ చేయగా చిత్ర బృందం దాన్ని కొట్టిపారేసింది.

Also Read: Telangana Rains: ఇద్దరి ప్రాణం తీసిన పిడుగులు.. తెలంగాణలో భయంకరంగా అకాల వర్షాలు

Also Read: Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్‌ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు`

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News