Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్.. ఆశ్చర్యపోతున్న పవన్ అభిమానులు..

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఏళ్లు గడుస్తున్నా కూడా పూర్తి కాలేదు. చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉండిపోయిన చిత్ర బృందం తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2024, 07:39 PM IST
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్.. ఆశ్చర్యపోతున్న పవన్ అభిమానులు..

Ustaad  Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే కొన్నేళ్ళు గడిచాయి కానీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. నిన్న మొన్నటి దాకా మిగతా సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పక్కన పెట్టేసారు. గత ఏడాది మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. ఈ షెడ్యూల్ లో హరీష్ శంకర్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఇక ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీ అయిపోయారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా కేవలం జనసేన పార్టీ మీద మాత్రమే దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడంతో ఇక ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవని అభిమానులు కూడా సినిమాపై ఆశలు వదులుకున్నారు.

చిత్ర బృందం కూడా సినిమా విషయంలో చాలా కాలం మౌనం వహించింది. కానీ తాజాగా ఇప్పుడు చిత్ర నిర్మాతలు సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నిసార్లు వాయిదా పడడంతో ఈ సినిమా విషయంలో విసుగెత్తిపోయిన అభిమానులు సినిమా ఎప్పుడో అటకెక్కేస్తుంది అని అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ ఇప్పుడు మరొకసారి కొత్త అప్డేట్ అంటూ ముందుకు రావడంతో అసలు సినిమా ఇంకా ఉందా అంటూ తిరిగి ట్రోల్ చేస్తున్నారు.

త్వరలో ఒక డైలాగ్ టీజర్ ను విడుదల చేస్తూ సినిమా ను ప్రమోట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాపై పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్న అభిమానులకి ఈ టీజర్ తో అయినా తిరిగి నమ్మకం వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News