Ram Charan: చిరంజీవితో పోటీపడనున్న రామ్ చరణ్.. గెలవబోయేది ఎవరు!

Game Changer Update : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పనులతో బిజీగా ఉండగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 13, 2024, 11:30 AM IST
Ram Charan: చిరంజీవితో పోటీపడనున్న రామ్ చరణ్.. గెలవబోయేది ఎవరు!

Game Changer Release Date : వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమాకి పోటీగా మెగా పవర్ స్టార్ సినిమా కూడా విడుదల అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఈ మధ్యనే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రస్తుతం చిరంజీవి బింబిసారా ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలకి సిద్ధంకాబోతోంది. 

ఇదిలా ఉండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. 

శంకర్, రామ్ చరణ్ కాంబోలో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు ఇప్పటినుంచే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల కావాలి. కానీ ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలని బట్టి గేమ్ చేంజర్ సినిమా విడుదల కూడా ఉంటుంది. 

ఇండియన్ 2 సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదే జరిగితే గేమ్ చేంజర్ సినిమా కూడా వాయిదాపడుతుంది. నవంబర్ దాటితే.. ఈ సినిమా వచ్చేది సంక్రాంతి సీజన్ మాత్రమే. అయితే చిరంజీవి ఆల్రెడీ సంక్రాంతికి విశ్వాంబరా సినిమాతో వస్తున్నామని చెప్పేశారు. కాబట్టి విశ్వంభర సినిమాకి పోటీగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 

ఒకవేళ అదే జరిగితే మెగా తండ్రికొడుకులు మధ్య పోటీ గురించి మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Also read: 4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో ఎలక్షన్ పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. !

Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News