Rama Janmabhoomi Teaser: అట్ట‌హాసంగా 'రామ జ‌న్మ‌భూమి' టీజ‌ర్ లాంఛ్..

Rama Janmabhoomi Teaser: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రామ భ‌క్తులు భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేలుతున్నారు.  కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో అయోధ్య‌లో భ‌వ్య‌మైన రామ మందిరం కొలువైంది. ఈ నేప‌థ్యంలో తెలుగులో రామ జ‌న్మ‌భూమితో ఓ సినిమా రాబోతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 11, 2024, 01:55 PM IST
Rama Janmabhoomi Teaser: అట్ట‌హాసంగా 'రామ జ‌న్మ‌భూమి' టీజ‌ర్ లాంఛ్..

Rama Janmabhoomi Teaser: అయోధ్య దాదాపు 5 శ‌తాబ్దాల త‌ర్వాత హిందూ బంధువుల క‌ల నెర‌వేరింద‌. కేంద్రంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం చొర‌వ‌తో అయోధ్య‌లో రాముడు పుట్టిన స్థలంలో బాల రాముడిగా కొలువైన సంగ‌తి తెలిసిందే క‌దా. ఇప్ప‌టికే దేశ‌, విదేశాల నుంచి ఎంతో మంది రామ భ‌క్తులు కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రు ఆ రామున్ని ద‌ర్శించుకొని త‌రిస్తున్నారు. ఇక ద‌ర్శ‌కుడు స‌ముద్ర త‌న సొంత నిర్మాణ సంస్థ స‌ముద్ర బ్యాన‌ర్ నుండి రామ‌జ‌న్మ‌భూమి టీజ‌ర్ రిలీజైంది. యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని  ఆక‌ట్టుకుంటుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా  ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.  

సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ప్ర‌స్తుతం దేశం మొత్తం ఎక్కడ విన్నా జై శ్రీ రామ్ నినాదమే. రామ జన్మ భూమి నిర్మాణం అయ్యాక రోజు లక్షల్లో భక్తులు ఆ బాల రాముణ్ణి దర్శనం చేసుకుంటున్నారు, అలాంటి ‘రామ జన్మ భూమి’ టైటిల్ తో దర్శకుడు సముద్ర గారు జై సిద్దార్ద్ హీరోగా సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. . సముద్ర ఎన్నో హిట్టు సినిమాలు ఇచ్చారు. ఈ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter బి జే పి ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ:  ఈరోజు కర్నల్ బిక్షపతి  ఫోన్ చేసారు, ఒకప్పుడు కాశ్మీర్లో మిలిటరీ వారి ముఖాల మీద, మోకాళ్ళ మీద రాళ్ళూ వేసే వారు. అందుకని పేస్ షీల్డ్స్ అండ్ క్నీ పాడ్స్ ఇచ్చాము. మోది ఆర్టికల్ 370 ఎత్తేయ్యగానే ఆ రాళ్ళూ విసిరే వాళ్ళే లేరు అని చెప్పారు. ఈ మార్పు అంతా కూడా మోది గారి వల్లనే వచ్చింది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనం రాముడినే ఎక్కువగా కొలవడానికి కారణం రాముడు ఈ భూమి మీద ధర్మ బద్ధంగా ఉంటూ అనేక కష్టాన‌ష్టాల‌ను ఓర్చి పాల‌న సాగించారు.  ‘రామ జన్మభూమి’ టీసర్ కొస్తే  హీరో తన దేశ భక్తి చాటుకునేలా ఉంది, సినిమా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటున్నారు.

డైరెక్టర్ సముద్ర  మాట్లాడుతూ: ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బ్రతికారు.  ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్ళకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బ్రతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాల‌న్నారు.  ధర్మంగా మెలగాలని  మనస్పూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాల‌నే సందేశంతో ఈ సినిమా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

హీరో జై సిద్ధార్థ్ మాట్లాడుతూ:  ఇండస్ట్రీకీ సింహరాశి, శివ రామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరీ, మహానంది  లాంటి గొప్ప సినిమాలని అందించిన వి. సముద్ర  దర్శకత్వంలో నా రాముడి పేరుతో వచ్చిన ‘రామ జన్మ భూమి’ సినీమాతో నేను హీరో గా లాంఛ్ అవ్వడం చాలా సంతోష‌కరంగా ఉంది. రాముడు ఎప్పుడో మనకి నేర్పిన వాటిని మనం ఎప్పుడూ తప్పకుండా పాటించాలి, అలా పాటించడం మర్చిపోయినప్పుడు, హనుమంతుడు వచ్చి సరి చేసి వెళ్తారు, అందుకే ఇప్పుడు నరేంద్రమోదిగారు హనుమంతుని రూపంలో వచ్చి మన దేశాన్ని గాడిలో పెడుతున్నారు. అలాగే లోకల్ లో చాలా మంది చిన్న చిన్న రాక్షసులు ఉంటారు వాళ్ళని లైన్  లో పెట్టడానికి యువత రాజకీయాలలోకి రావాలనేదే  మా కథ.

మా ‘రామ జన్మ భూమి’ అప్డేట్స్, రిలీజ్ డేట్ ముందు ముందు మరెన్నో ఇచ్చి ప్రేక్షకులని ఇదే రీతిలో అలరిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు

నటీనటులు: జై సిద్ధార్ద్, శ్రీ రాధా ,నాసర్, సుమన్, అజయ్ గోష్
సునీల్, అనుపమ్ ఖేర్, కన్నడ కిషోర్, బాహుబలి ప్రభాకర్, దేవ్ గిల్
బీసంట్ రవి, తమిళ్ శ్రీ రామ్
దేవరాజ్ తదితరులు

Also Read: Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News