Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను ఢీ కొట్టే హీరో మన దేశంలో ఎవరు లేరు.. రెబల్ స్టారా.. మజాకా.. !

Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అలరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2024, 06:57 PM IST
Prabhas: ఆ విషయంలో  ప్రభాస్‌ను ఢీ కొట్టే హీరో మన దేశంలో ఎవరు లేరు.. రెబల్ స్టారా.. మజాకా.. !

Prabhas: ఆకాశంలో తారలు ఎందరున్నా.. చుక్కల్లో చంద్రుడు ఒక్కడే. అలాగే భారత దేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. హీరోగా ప్రభాస్ కున్న క్రేజ్ వేరు.  అంతేకాదు హీరోల్లో తాను ఎంతో ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్.  రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్...ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందనంత దూరంలో ఉన్నాడు. 

అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ భారత్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే ప్రభాస్ పేరే వినిపిస్తోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ కనిపించింది. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ భారత్‌ లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్. 

ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్‌డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ట్విట్టర్ భారత్ (ఇండియా) ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు నిదర్శనం. ఇక సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అనుకోవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్ తో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్, స్పిరిట్‌తో పాటు హను రాఘవపూడి, కన్నప్ప మూవీలతో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్‌ను పలకరించబోతున్నారు.  

Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News