Renu Desai : తాను వరుణ్ తేజ్ పెళ్లికి వెళితే జరిగేది అదే అంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..

Varun Tej Wedding : టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న ఈ నటి మరోసారి వెండితెరపై కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మీడియాకి కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తోంది రేణు దేశాయ్. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి మెగా ఫ్యామిలీలో జరుగుతుండగా ఈ పెళ్లికి రేణు దేశాయ్ అలానే పవన్ కళ్యాణ్ పిల్లలు వెళతారా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది. కాగా దీనిపైన క్లారిటీ ఇచ్చేసింది ఈ నటి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 06:00 AM IST
Renu Desai : తాను వరుణ్ తేజ్ పెళ్లికి వెళితే జరిగేది అదే అంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..

Renu Desai : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ సినీ ప్రేక్షకులకు రేణు దేశాయ్ అంతే ప్రత్యేక స్థానం ఉంది. దానికి ముఖ్య కారణం ఈ నటి రియల్ లైఫ్ లో తన మంచితనంతో అలానే తన మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవడమే. విడాకులు అయిన తరువాత కూడా ఎటువంటి నెగిటివ్ వివాదాల జోలికి వెళ్లలేదు రేణు దేశాయ్. అంతే కాదు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ అభిమానులు అవసరానికి మించి తనను ఒక మాట అన్న కాని.. వాటికి హుండాగానే జవాబు ఇస్తూ వచ్చింది.

అంతేకాదు పవన్ కళ్యాణ్ తో విడిపోయి చాలా సంవత్సరాలు అయినా తన పిల్లలు అకిరా, ఆధ్యా కోసం ఇంకా రెండో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది ఈ నటి. కాగా పవన్ కళ్యాణ్ పిల్లలు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపిస్తూ వచ్చిన ఏ ఫంక్షన్ లో రేణు దేశాయ్ మాత్రం విడాకులు తర్వాత కనిపివ్వలేదు. తన పిల్లల వరకు మెగా ఫ్యామిలీ లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పంపిస్తూ ఉండేది.

ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీకి చెక్కేశాయి. ఇంకొంత మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఇటలీకి పయనం అయ్యారు. కాగా వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లి కూడా ఇలానే రాజస్థాన్ లో జరిగింది. ఆ పెళ్లికి పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా, ఆద్య కలిసి వెళ్లారు.

కానీ ఈసారి వరుణ్ పెళ్లికి మాత్రం పవన్ కళ్యాణ్ తన పిల్లలతో వెళ్ళనట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి ఈ పెళ్లికి వెళుతున్నట్టుగా ఎయిర్పోర్ట్ నుంచి ఫోటోలు బయటకు వచ్చాయి. మరి ఈ పెళ్లికి రేణు దేశాయ్ అలానే పిల్లలు వెళతారా లేదా అనే సందేహం అందరిలో ఉండగా వరుణ్ తేజ్ పెళ్లి పైన రేణూదేశాయ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.

తాను రాజస్థాన్ లో జరిగిన నిహారిక పెళ్లికి కూడా వెళ్లలేదని, పిల్లల్ని మాత్రమే పంపించాను అని చెప్పుకొచ్చింది. కాగా వరుణ్ తేజ్ తన కళ్ల ముందు పెరిగాడని, అతనికి ఎప్పుడూ తన ఆశీస్సులుంటాయని, తాను పెళ్లికి వెళ్తే అందరికీ అన్ కంఫర్టబుల్‌గా ఉంటుందని అసలు విషయం చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఈ సారి అకిరా, ఆద్యలు సైతం వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లడం లేదన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అనగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇటలీకి బయలుదేరేశారు. మరోపక్క రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం పిల్లలు తన దగ్గరే ఉన్నారు. ముంబైలోని కాలీ పీలి ట్యాక్సీలు ఈ నెలాఖరు వరకు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటిని అక్కడి ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా, చివరి సారిగా ఆద్యను కాలీ పీలి ట్యాక్సీని ఎక్కించింది రేణూ దేశాయ్. ఇక ఈ వీడియోని ఈ నటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటలీకి బయలుదేరిన పిల్లలు రేణు దేశాయ్ తోనే ఉండడంతో అలానే రేణు దేశాయ్ తాను తప్పకుండా పెళ్లికి వెళ్ళను అని వివరణ ఇవ్వటంతో.. ఇక అకిరా, ఆధ్యా కూడా వరుణ్ తేజ్ పెళ్లికి దూరంగానే ఉంటారు అని తెలుస్తోంది.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News