Renu Desai: బ్రేకప్.. విడాకులు నేరం కాదు.. జర్నలిజం అంటే అదేనా: రేణు దేశాయ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. రేణు దేశాయ్ పైన ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. వీటి పైన ఎన్నోసార్లు స్పందించిన రేణుదేశాయ్ ఈసారి కొంచెం ఘాటుగానే స్పందించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2023, 07:57 PM IST
Renu Desai: బ్రేకప్.. విడాకులు నేరం కాదు.. జర్నలిజం అంటే అదేనా: రేణు దేశాయ్

 Renu Desai On Her Divorce: సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితం పై ఎన్నో రూమర్లు అలానే ఎన్నో విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని కొంతమంది బయటకి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం వాళ్ళ పైన వస్తున్న విమర్శల గురించి ఘాతుగానే స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పైన సోషల్ మీడియాలో అలానే యూట్యూబ్ లో మనం ఎన్నో కామెంట్లు చూస్తూ.‌ వింటూనే ఉంటాం. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని తన జీవితం తాను గడుపుతున్న.. ఇంకా కొంతమంది ఆమె పైన ..ఎందుకో తెలియదు కానీ.. ఏదో ఒక రకంగా మాటలు అంటూనే ఉంటారు.

ఇక వీటితో పూర్తిగా విసిగిపోయిన రేణు దేశాయ్ ఈరోజు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పెద్ద పోస్ట్ వేసేసింది. 
‘జర్నలిజం అంటే ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను? కేవలం మా పర్సనల్ జీవితాల గురించి రాయడం,మాట్లాడటమే జర్నలిజమా?.. మా పర్సనల్ జీవితాలు నిజంగానే సమాజాన్ని అంతగా ప్రభావం చేస్తున్నాయా? చెడగొడుతున్నాయా?  ఫిల్మ్ క్రిటిక్స్ సినిమాలు చూసి రివ్యూలు రాయడం వరకు బాగానే ఉంటుంది.. వారికి ఆ స్వేచ్చ ఉంది.. కానీ మా సినిమా వాళ్ల పర్సనల్ జీవితాలు అనేవి జర్నలిజం కిందకు రావు..’ అంటూ ఒక ఫోటో షేర్ చేసింది రేణు దేశాయ్.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

కాగా ఈ ఫోటో కింద ఒక పెద్ద క్యాప్షన్ కూడా రాసింది.
‘యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం వంటివి వచ్చాక.. ప్రతీ ఒక్కరూ మా పర్సనల్ జీవితాల గురించి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.. అసలు వాటికి వ్యూస్ చూస్తుంటే కూడా సమాజంలో ఎంత నెగెటివిటీ ఉంది, దాన్ని ఎంత మంది ఇష్టపడుతున్నారో అర్థం అవుతోంది…ఒక వేళ క్రియేటివ్ పీపుల్స్ సినిమాలు తీయడం ఆపేస్తే.. పాటలు రాయడం ఆపేస్తే.... అసలు శుక్రవారం సినిమాలు రిలీజ్ కాకపోతే.. ఆ మిగిలిన 95 శాతం జనం ఏమైపోతారో కనీసం ఒక్కసారన్నా  ఆలోచించండి.. మనం పాడుకోవడానికి పాటలే లేని సమాజాన్ని ఒక్కసారి ఊహించుకోండి..ప్రతీ క్రియేట్ పర్సన్ చాలా  సెన్సిటివ్‌గా ఉంటారు.. ఓ కళను నమ్ముకుని తమ భావాలను వ్యక్త పరుస్తుంటారు.. అయితే ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి ఉండేలానే మాకు కూడా సమస్యలు ఉంటాయి.. వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి.. ప్రేమ, బ్రేకప్పులు అనేవి మాక్కూడా ఉంటాయి.. మేం కూడా తప్పులు చేస్తాం కానీ వాటిపైనే పడి ఇలా డబ్బులు సంపాదించుకోవడం అనేది కరెక్ట్ పద్దతి కాదు.. బ్రేకప్, డైవర్స్ అనేది క్రైమ్ కాదు.. ఇలా నా జీవితంలో జరిగిన వాటి గురించి చెప్పే హక్కు నాకుంటుంది.. వాటిని చూడాలా? వినాలా? వద్దా అన్నది మీ ఇష్టం. అయితే కొంతమంది మాత్రం కెమెరా ముందు వచ్చి, సీట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది బాధ్యతాయుతమైన జర్నలిజం కాదు.. ఇలా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే నేను ఒక పది పేజీలు రాయగలను.. ఒకరి పర్సనల్ జీవితం, వారు పడే బాధల మీద మనం మాట్లాడుతూ, వార్తలు రాస్తూ డబ్బులు సంపాదించుకోవడం అనేది మంచి పద్దతి కాదు. అతి నీతి అనిపించుకోదు.. ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టాక కొంత మంది నెగటివ్ కామెంట్లు చేయడానికి కూడా వస్తారని నాకు తెలుసు.. కానీ ఏది తప్పు ఏది రైట్ అన్నది మీ అందరికీ తెలుసు’ అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ వేసింది రేణు దేశాయ్.

కాగా రేణుదేశాయ్ ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. తను ఎన్నోసార్లు తన పర్సనల్ లైఫ్ దగ్గరకు రావద్దు అని రిక్వెస్ట్ చేసింది. అయినా ఇంకా కూడా యూట్యూబ్లో కొంతమంది తన గురించి మాట్లాడుతూ ఉండడంతో ఇలాంటి ఒక పోస్ట్ చేసింది ఈ నటి.

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

 

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News