Samantha: రెండో పెళ్లిపై సమంత కామెంట్స్.. ఎన్నిసార్లు చేసుకున్నా విడాకులు కామన్

Samantha Ruth Prabhu: సమంత.. నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో మాత్రం చర్చలు సాగుతూనే ఉంటాయి.. ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా అని అనుమానాలు కూడా ఎంతోమందిలో ఉన్నాయి…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 05:15 AM IST
Samantha: రెండో పెళ్లిపై సమంత కామెంట్స్.. ఎన్నిసార్లు చేసుకున్నా విడాకులు కామన్

Samantha on Second Marriage: నాగచైతన్య.. సమంత.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన జంట. ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే అందరిని మాయ చేసేసారు వీరిద్దరూ. కాగా వీరిద్దరే పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ మనం ఒకటి కలిస్తే విధి మరొకటి తలచినట్టు.. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకునేసాడు వీరిద్దరూ.

వీరిద్దరూ విడాకులు తీసుకున్న వీరిద్దరికీ కామన్ గా ఉన్న అభిమానులు మాత్రం ఇంకా వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఇక ఇదే సందేహాన్ని సమంత అభిమాని ఒకడు ఇంస్టాగ్రామ్ లో అడిగేశారు.

ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే సమంత చాలా రోజుల తర్వాత సమంత మళ్లీ ఆదివారం (డిసెంబర్ 17న) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో ప్రశ్నలు-సమాధానాలు సెషన్ నిర్వహించారు. దీంతో సమంత అభిమానులు సంబరపడిపోయి తమ అభిమాన హీరోయిన్ ని ఎన్నో ప్రశ్నలు అడగసాగారు. ఒక అభిమాని ఇదే అవకాశం అనుకొని ‘మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన మీకు ఉందా?’ అని అడిగేశారు. కాగా ఈ ప్రశ్నకు సమంత చాలా చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. 

2023 విడాకుల లెక్కల నివేదిక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి.. ‘తాజా లెక్కల ప్రకారం పెళ్లి చేసుకోవడం సరైన  పెట్టుబడి కాదు’ అని బిజినెస్‌లో పెట్టుబడి మాదిరిగా సమాధానం ఇచ్చారు. దీనికి ఒక స్మైల్ ఎమోజీని కూడా జత చేశారు ఈ హీరోయిన్.

సమంత షేర్ చేసిన లెక్కల ప్రకారం.. 2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లిచేసుకున్న వారిలో 50% మంది విడాకులు తీసుకున్నారు. కాగా రెండోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 67% ఉండగా.. మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 73 శాతంగా ఉంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలాగే ఉందట. ఇదే విషయాన్ని స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ మరి అందరికీ తెలియజేసింది సమంత .. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా విడాకులు కామన్.. అలాంటప్పుడు ఇంక రెండో పెళ్లి ఎందుకయ్యా? అన్నట్టుగా తన అభిమానికి సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం సమంతా ఇచ్చిన ఈ జవాబు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News