Shivani Rajashekar: హిట్లు ఉన్నాయి.. ఆఫర్లు లేవు.. మళ్లీ ఓటీటీ బాటలోనే స్టార్ హీరో కూతురు

Shivani Rajashekar recent movie : రాజశేఖర్-జీవితాల గారాల పట్టి శివాని రాజశేఖర్ ఓటీటీ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. గత కొంతకాలంగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శివాని రాజశేఖర్ మళ్లీ ఓటీటీ సినిమానే నమ్ముకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 18, 2024, 10:55 PM IST
Shivani Rajashekar: హిట్లు ఉన్నాయి.. ఆఫర్లు లేవు.. మళ్లీ ఓటీటీ బాటలోనే స్టార్ హీరో కూతురు

Shivani Rajashekar recent OTT movie: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. కొన్ని కొన్ని సార్లు అదృష్టం కూడా వరిస్తేనే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా అదృష్టం లేకపోతే సినిమాలు హిట్ అవుతున్నా కూడా ఆఫర్లు రావు. 

ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ విషయంలో కూడా అదే జరిగింది. అందానికి అందం, ట్యాలెంట్ తో పాటు మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ అన్నీ శివాని రాజశేఖర్ కి ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా మంచి ఆఫర్లు మాత్రం ఈమెకు కరువయ్యాయి అని చెప్పుకోవచ్చు.

ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి శివానీ రాజశేఖర్ కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ వచ్చింది. అద్భుతం అంటూ తేజ సజ్జ హీరోగా ఓటీటీ లో మంచి హిట్ అందుకున్న శివాని రాజశేఖర్ తరువాత కోటబొమ్మాలి సినిమాతో కూడా మంచిది విజయాన్ని అందుకుంది. పేరుకి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం రాలేదు. కోటబొమ్మాలి సినిమా కోసం శివాని భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా చేసింది. దానికి తగ్గట్టుగానే సినిమా మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. 

కానీ ఎంత సినిమా హిట్ అయిన కూడా ఆమెకు ఆఫర్లు మాత్రం కరువైపోయాయి. దీంతో జీవిత రాజశేఖర్ స్వయంగా రంగంలోకి దిగి సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో శివాని హీరోయిన్ గా సినిమా తీయాలని ప్లాన్ చేశారు కానీ అది కూడా కుదరలేదు. తమిళ్లో రెండు సినిమాలు చేసిన అవి కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 

ఈ నేపథ్యంలో శివాని మరొకసారి ఓటీటీ నే నమ్ముకుంది. ఆమె హీరోయిన్గా నటించిన విద్యా వాసుల అహం అనే సినిమా రాహుల్ విజయ్ హీరోగా ఈ మధ్యనే ఆహాలో విడుదలైంది. అద్భుతం అంటూ ఓటీటీ సినిమాతోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శివాని మరొకసారి ఓటీటీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 

గతంలో కూడా రాజ్ తరుణ్ తో కలిసి ఆహనా పెళ్ళంట అంటూ ఒక వెబ్ సిరీస్ లో నటించింది.నిజానికి ఈమె మామూలు సినిమాలు కంటే ఓటీటీ సినిమాలు ఎక్కువగా చేసింది అనుకోవచ్చు. మరి తాజాగా శివాని నటించిన ఈ ఓటీటీ సినిమా ఆమెకు ఎంతవరకు మంచి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Read More: Sweat Rice Balls: అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో టెస్టీ డిష్.. ఎగబడుతున్న స్థానికులు.. కారణం ఏంటంటే..?

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News