Samantha: సెన్సేషనల్ సినిమా మిస్ చేసుకున్న సమంత.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్

Sruthi Haasan: శృతిహాసన్ ..సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్స్. ఇప్పటికీ ఈ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా.. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్స్ ఎక్కువమంది వస్తూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 08:03 PM IST
Samantha: సెన్సేషనల్ సినిమా మిస్ చేసుకున్న సమంత.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్

Sruthi Haasan In Chennai Story: సమంత మైటోసిస్ వ్యాధి బారిన పడిన తరువాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంది. కానీ తను ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు కొన్ని పెండింగ్ లో ఉండడంతో ఈ మధ్యనే అవన్నీ పూర్తి చేసింది. యశోద, శకుంతలం, ఖుషి ఇలా పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఫినిష్ చేసి తిరిగి కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ప్రకటించింది.

మరోపక్క శృతిహాసన్.. కొద్ది రోజులపాటు సినిమాలలో కనిపించక పోయిన గత సంవత్సరం సంక్రాంతి నుంచి మళ్లీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, ప్రభాస్ సలార్ చిత్రాలలో కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు సలార్ రెండో భాగంతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని సమంత మిస్ చేసుకుందని ఆ గోల్డెన్ ఛాన్స్ శృతిహాసన్ దగ్గరకు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే దాదాపు మూడు సంవత్సరాల క్రితం సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక హాలీవుడ్ సినిమాలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ చిత్ర షూటింగ్ ఇప్పుడు ప్రారంభం కానుందట. అయితే ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సమంత ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి చెన్నై స్టోరీ అని టైటిల్ ఈ మధ్యనే ఫిక్స్ చేశారు సినిమా యూనిట్. ఈ ప్రాజెక్టు నుంచి ఇలాంటి టైంలో సమంత తప్పుకోవడంతో ఆమె స్థానంలో శృతిహాసన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

రొమాంటిక్ కామెడీ జాన్రా లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ అను అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటించనుంది. అంతేకాదు ఈ డిటెక్టివ్ పాత్ర బై సెక్స్యువల్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు.
మొత్తానికి ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడంతో అనూహ్యంగా ఈ గోల్డెన్ చాన్స్ శృతిహాసన్ సొంతం కావడం గమనార్హం. మరి ఈ సినిమాతో శృతిహాసన్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News