Mahesh Babu - Rajamouli - SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాపై వస్తోన్న ఆ రూమర్స్ ఖండించిన చిత్ర యూనిట్..

Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 03:00 PM IST
Mahesh Babu - Rajamouli - SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాపై వస్తోన్న ఆ రూమర్స్ ఖండించిన చిత్ర యూనిట్..

Mahesh Babu - Rajamouli -SSMB29:  రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు షురూ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన .. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ప్రకటించనున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి యేడాది తన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా తన మూవీలకు సంబంధించిన ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా రాజమౌళితో చేయబోయే సినిమాను మే 31న అఫిషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను  రాజమౌళి తెరకెక్కించనున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనలైజ్ అయిపోయిందనేది సమాచారం.  అంతేకాదు  మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరు ఫైనల్ కాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.   తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ లేదా జాన్వీ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమా కథతో పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్ సహా పూర్తి బైండెడ్ స్క్రిప్ట్ పూర్తైయినట్టు సమాచారం.

v

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విరేన్ స్వామి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా జాయిన్ అయినట్టు నేషనల్ మీడియా కోడై  కూసింది. దీనిపై చిత్ర యూనిట్ శ్రీదుర్గా ఆర్ట్స్ అధినేత కాజా లక్ష్మి నారాయణ స్పందించారు. ఓ లెటర్ పోస్ట్ చేసారు. ఇదంత ట్రాష్.  మేము ఈ సినిమా కోసం ఎలాంటి క్యాస్టింగ్ డైరెక్టర్ను నియమించలేదని వివరణ ఇచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమైన క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే యేడాది సెకండాఫ్ వరకు కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News