Tamannaah Bhatia: అబ్బాయిగా మారిపోయిన తమన్నా భాటియా.. భారీ షాక్‌లో అభిమానులు!

Tamannaah Bhatia shocking transformation. ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చే తమన్నా.. ఉన్నట్టుండి ప్యాంటు షర్ట్ ధరించి అబ్బాయిగా మారిపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 07:34 PM IST
  • అబ్బాయిగా మారిపోయిన తమన్నా
  • మీసాలు, హెయిర్ స్టైల్‌తో అచ్చంగా అబ్బాయిలా
  • ఎఫ్ 3 చిత్రంలో అబ్బాయిగా
Tamannaah Bhatia: అబ్బాయిగా మారిపోయిన తమన్నా భాటియా.. భారీ షాక్‌లో అభిమానులు!

Tollywood Actress Tamannaah Bhatia shocking transformation: తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. 'హ్యాపీడేస్' సినిమాతో వెలుగులోకి వచ్చిన మిల్కి బ్యూటీ.. ఆతర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోల సరసన నటించారు. హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2 సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

కెరీర్ మంచి ఊపు మీదున్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా.. అందరినీ ఆశ్చర్యపరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇక  సినిమాలతో ఎంత బిజీబిజీగా ఉన్నా కూడా.. తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చే తమన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో ఉన్నట్టుండి ప్యాంటు షర్ట్ ధరించి అబ్బాయిగా మారిపోయారు. వీడియోలో డోర్ ముందు నిలబడి చీర కట్టులో ఎంతో అందంగా కనిస్తారు మిల్కీబ్యూటీ. లోపలి వెళ్లి డోర్ వేసి.. తెరిచేసరికి ప్యాంట్, టీషర్ట్, మీసాలు, హెయిర్ స్టైల్‌తో అచ్చంగా అబ్బాయిలా మారిపోతారు. మరోసారి లోపలికి వెళ్లి బయటికి వచ్చేప్పుడు ఒరిజినల్ గెటప్‌లో ఉంటారు. ప్రస్తుతం తమన్నా ట్రాన్సపర్మేషన్‌కి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

తమన్నా ట్రాన్సపర్మేషన్‌ అయింది సినిమా కోసమే. ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రంలో అబ్బాయిగా కొన్ని సీన్లలో నటించించారు. అందులోని ఓ గెటప్ ఇది. వీడియో చుసిన ఫాన్స్.. తమన్నా షాకింగ్ ట్రాన్సపర్మేషన్‌కి ముందుగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తమన్నా 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో సత్యదేవ్ సరసన నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' లోనూ తమన్నా నటించనున్నారు. దటీజ్ మహాలక్ష్మి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 

Also Read: Sonali Bendre: ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్‌!

Also Read: Pujita Ponnada Pics: నాభి అందాలతో పిచ్చెకిస్తున్న పూజిత పొన్నాడ.. తెలుగందం గ్లామర్ డోస్ మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News