Valentines Day 2023 : వాలెంటైన్స్ డే స్పెషల్.. రీల్ కపుల్స్ టు రియల్ కపుల్స్.. క్రేజీ జంటలివే

Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్‌ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 12:04 PM IST
  • వాలెంటెన్స్ డే స్పెషల్
  • రీల్‌పై లవర్స్.. రియల్‌ లైఫ్‌లో భార్యాభర్తలు
  • బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు
Valentines Day 2023 : వాలెంటైన్స్ డే స్పెషల్.. రీల్ కపుల్స్ టు రియల్ కపుల్స్.. క్రేజీ జంటలివే

Mahesh Babu Namrata Love Story వాలెంటైన్స్ డే మన దేశంలో పుట్టకపోయినా.. మన సంస్కృతి కాకపోయినా ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం అంటూ ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రేమలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఓ దినం అంటూ అవసరం లేదు. వారికి ప్రతీ రోజూ లవర్స్ డేలానే ఉంటుంది. ప్రేమలు అనగానే మనకు సినిమాలు, హీరో హీరోయిన్లు గుర్తుకు వస్తుంటారు. తెరపై జంటగా కనిపించి.. నిజ జీవితంలోనూ జంటలుగా మారిన వారెంతో మంది ఉన్నారు.

ఈ తరానికి తెలిసిన సెలెబ్రిటీ ప్రేమ జంటల గురించి, వారి ప్రేమ కథల గురించి చెప్పుకుందాం. మహేష్‌ బాబు నమ్రతలు వంశీ సినిమాతో ఒక్కటయ్యారు. ఆ సినిమా ప్రయాణంలోనే ప్రేమ చిగురించింది. చివరకు అతడు సినిమా టైంలో పెళ్లి చేసుకున్నారు. ముంబై అమ్మాయి.. హైద్రాబాద్‌ అబ్బాయికి అలా లంకె కుదిరింది.

మరో క్రేజీ జంటగా సూర్య, జ్యోతిక నిలుస్తుంది. కోలీవుడ్‌లో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. పెళ్లికి ముందు, తరువాత ఈ జంట ఎన్నో సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆన్ స్క్రీన్‌లో వీరిది సక్సెస్ ఫుల్ పెయిర్. ఇక రియల్ లైఫ్‌లోనూ సూర్య, జ్యోతిక జంట సక్సెస్ అయింది. ఇప్పటికీ సూర్య, కార్తీ ఇలా కుటుంబాన్ని అంతా కూడా జ్యోతిక ఒక్కటిగా ముందుకు సాగేలా చేస్తోంది.

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ లవ్ స్టోరీ కాస్త కొత్తగా, వింతగా అనిపిస్తుంది. కత్రినాకు సల్మాన్ ఖాన్‌, కత్రినా రణ్‌ బీర్ కపూర్ ఇలా ఎన్నెన్నో జంటల పేర్లు వినిపించాయి. చివరకు కత్రినా విక్కీ కౌశల్ జోడి పెళ్లి పీటలెక్కింది. ఈ ఇద్దరూ గత ఏడాదిలో వివాహాం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. రణ్‌ బీర్ కపూర్‌ విషయంలోనూ అలానే జరిగింది. ఎంతో మందితో ఎఫైర్లు సాగించిన రణ్‌ బీర్ చివరకు అలియా భట్‌ను వివాహాం చేసుకున్నాడు.

కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి గత వారమే అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి షేర్షా సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రియల్ లైఫ్‌లో వీరి ప్రేమ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫిబ్రవరి 7న వివాహా బంధంతో కియారా, సిద్దార్థ్ ఒక్కటయ్యారు. ఇలా ఎంతో మంది హీరోలు తమ తమ ప్రేమను గెలిపించుకున్నారు. నితిన్, నిఖిల్, రానా, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌లు తమ తమ భాగస్వామ్యులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News