Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాట వింటారు.. చిరంజీవి మాట వినరు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan -Chiranjeeevi:  పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేవారు కొంతమంది అయితే ఆయన్ని తిడుతూ వ్యాఖ్యలు చేసేవారు మరి కొంతమంది. అయితే చాలామంది కేవలం పబ్లిసిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతూ ఉంటారని అంటూ ఉంటారు ఆయన అభిమానులు.. ఇప్పుడు అలాంటి సంగతనే మరొకటి చోటు చేసుకుంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 10:25 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాట వింటారు.. చిరంజీవి మాట వినరు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan - Trivikram: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రానే వచ్చేసాయి. మరో రెండు రోజుల్లో ఓటింగ్ జరుగనుంది. ఈ ఎలక్షన్స్ లో వైసిపి పార్టీని ఎలాగైనా ఓడించాలని.. టిడిపి,‌ పవన్ కళ్యాణ్ జనసేన ఏకమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

మామూలుగా తరచూ ప్రభాస్ గురించి ఏదో ఒక నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు వేణు స్వామి. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పి పేరు తెచ్చుకున్న ఈ జ్యోతిష్కుడు.. ఆ తరువాత కూడా కొన్ని ముందుగా చెప్పి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అయితే ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని మాత్రం కాదు. ఏవో కొన్ని మాత్రం జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ పైన ఏదో ఒకటి చెబుతూ బాగా పేరు తెచ్చుకున్న ఈ జ్యోతిష్కుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘పవన్ కళ్యాణ్‌‌కి ఆయనకు ఏదన్నా మంచి చెప్పినా కానీ గ్రహించరు. అసలు ఆయనకి మంచి చెప్పాలనుకున్న మగాడే ఈ ప్రపంచంలో లేడు. పవన్ కళ్యాణ్‌కి చెప్పే దమ్ము త్రివిక్రమ్‌కి మాత్రమే ఉంది. కానీ ఆయన ఆయనకు మంచి చెప్పరు. నాదెండ్ల మనోహర్ చెప్పరు. పోనీ చిరంజీవి చెప్తారా అంటే.. ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్ వినడు.. ఖతమ్ అయిపోయిందంటే. ప్రతి మనిషి జీవితంలో ఎవరో పెద్ద వ్యక్తి ఉండాలి. వాళ్ల మాట వారు తప్పకుండా వినాలి. భర్తకి భార్య కూడా గురువే. భర్త భార్యకి గురువే. తల్లి,తండ్రి, అన్న, అక్క, చెల్లి వీళ్లంతా కూడా మన జీవితంలో గురువులే. ఎవరొకరి మాట వినాల్సిందే. పెళ్లైంపైనో.. పిల్లలపైనో ప్రేమ ఉండాలి. ఎవరొకరి మాట వినాలి. కానీ పవన్ ఎవరి మాట వినరు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని నాకూ ఉంది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇష్టం వేరు.. ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో అవగాహనే లేదు. నేను ఆయనమంచికే చెప్తుంటా కానీ.. జనసైనికులు నన్ను ట్రోల్ చేస్తుంటారు. జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడినప్పుడు.. నేను మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడని చెప్పాను. అప్పుడు మాత్రం జనసైనికులు నన్ను మెచ్చుకున్నారు. ఆహా ఓహో ఏం చెప్పారు గురువుగారు అంటూ ఆ వీడియోలను షేర్ చేస్తారు. కానీ ఏదైనా మంచి చెప్తే మాత్రం వాళ్లకి అస్సలు నచ్చదు. తిడతారు.. ట్రోల్ చేస్తారు’ అంటూ ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి.

అయితే ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ మాటల వింటారు కానీ.. చిరంజీవి మాటలు వినరు అని చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా పేజెస్ లో చర్చకు దారితీస్తున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News