Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం ఉందని అంటున్నారు. బిచ్చగాడు 2 షూటింగ్ కోసం మలేషియా వెళ్లిన ఆయన అక్కడ షూట్ చేస్తూ పడవ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 19, 2023, 04:40 PM IST
Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Vijay Antony Crossed The Critical Stage Says Doctors: షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన నటుడు విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన క్రిటికల్ స్టేజ్ దాటినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఆంటోని తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేశారు. ఇక సింగర్ గా ఎన్నో పాటలు పాడిన విజయ్ ఆంటోని మాటల రచయితగా, ఎడిటర్‌గా కూడా అనేక సినిమాలకు పని చేశారు.

ఇక ముందుగా కొన్ని సినిమాల్లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చిన విజయ్ ఆంటోని నాన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తదనంతరం, ఆయన సలీం, ఇండియా పాకిస్తాన్, బిచ్చగాడు, భేతాళుడ, ఎమాన్, అన్నాదురై, కలి, తిమిరు బుడిచవన్, ఖోలక్కరన్, కోడియిల్ ఒరువన్ వంటి అనేక సినిమాల్లో నటించారు. ఆయన నటిస్తున్న దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ ఆంటోనీ కక్కి, పిచైకారన్ 2, ఖోలా, రత్తం, బోరి పట్టాడ మన్మన్, వల్లి మయిల్ వంటి సినిమాల్లో చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ ఆంటోని మలేషియాలో 'పిచైకారన్ 2' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ సమయంలో లంకావి ద్వీపం దగ్గరలోని సముద్రంలో స్కై జెట్ వాహనాన్ని నడుపుతుండగా విజయ్ ఆంటోనీ ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయన పడవలోని ఉన్న నటి కావ్య థాపర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. విజయ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని, విజయ్ ఆంటోని పెదవి పగిలిపోవడమే కాదు, పళ్లు విరిగిపోయాయని తెలుస్తోంది.

ఇక ఈ యాక్సిడెంట్ తమిళ చిత్రసీమలో పెను సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయి నీటిలో మునిగిపోయిన విజయ్ ఆంటోనిని చిత్రబృందం రక్షించి అక్కడి ఆసుపత్రిలో చేర్పించింది. ఫస్ట్ ఎయిడ్ అయ్యాక ఆయనని మలేషియా రాజధాని కౌలాలంపూర్ తీసుకు వెళ్లారని, అక్కడ ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే క్రిటికల్‌ స్టేజ్‌ దాటినట్లు చెబుతున్నారు.

నోటి కింద భాగం బాగా దెబ్బతినడంతో విజయ్ ఆంటోనీకి సర్జరీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు, ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని కుటుంబం నిన్న కౌలాలంపూర్ వెళ్ళింది. ఇక విజయ్ ఆంటోనీని కుటుంబ సభ్యులు ఈ రాత్రికి చెన్నైకి తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరనున్న విజయ్ ఆంటోనీకి వెంటనే సర్జరీ చేస్తారని అంటున్నారు.  

Also Read: VSR vs WV Collections: 'వీర సింహా'న్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తున్న వీరయ్య.. ఏకంగా అన్ని కోట్లు తేడానా?

Also Read: Varasudu vs Thegimpu: అక్కడ విజయ్ ను తొక్కేస్తున్న అజిత్.. మన దగ్గర మాత్రం భిన్నంగా కలెక్షన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News