నేను పాకిస్తాన్ వెళ్లడం లేదు : అమీర్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆహ్వానంపై క్లారిటీ ఇచ్చిన అమీర్ ఖాన్ 

Last Updated : Aug 2, 2018, 04:34 PM IST
నేను పాకిస్తాన్ వెళ్లడం లేదు : అమీర్ ఖాన్

పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మాజీ క్రికెటర్, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను వెళ్లడం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్‌ ఖాన్‌ తేల్చిచెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార వేడుక హాజరు కావాల్సిందిగా పాకిస్తా్న్ నుంచి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని అమీర్ ఖాన్ స్పష్టంచేశారు. ప్రస్తుతం పానీ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తాను ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని అమీర్ ఖాన్ వివరించారు.

ఆగస్టు 11న పాక్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు భారత మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూలను ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్లతోపాటు అమిర్‌ ఖాన్‌కు కూడా ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆహ్వానం అందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అమీర్ ఖాన్ గురువారం ఓ క్లారిటీ ఇచ్చినట్టు ఫస్ట్ పోస్ట్ పేర్కొంది.

Trending News