Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా టాలీవుడ్ నటి తమన్నా భాటియా (Tamannaah Tests Positive For COVID19) కరోనా బారిన పడింది.

Last Updated : Oct 4, 2020, 01:05 PM IST
  • కరోనా వైరస్ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు
  • పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను వణికిస్తోన్న కరోనా
  • తాజాగా కరోనా బారిన పడ్డ టాలీవుడ్ నటి తమన్నా భాటియా
Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా రాజకీయ, వ్యాపార, సినీ రంగ సెలబ్రిటీలు పలువురు కోవిడ్19 బారిన పడుతున్నారు. ఇటీవల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి అనంతరం కోలుకున్నా ప్రయోజనం లేకపోయింది. తాజాగా టాలీవుడ్ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడింది.

Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 

కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు నిర్వహించారు. తాజాగా వచ్చిన కోవిడ్19 ఫలితాలలో తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. టాలీవుడ్ నటి తమన్నాకు కరోనా పాజిటివ్ (Tamannaah tests positive for CoronaVirus)‌గా తేలడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా సోకందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read:  COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!

 

కాగా, కొన్ని రోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో కుటుంబం మొత్తం కరోనా పరీక్షలకు వెళ్లింది. కోవిడ్19 ఫలితాలలో తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొందరు సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలగా.. తమన్నాకు మాత్రం అప్పుడు నెగిటివ్‌ అని వచ్చింది. తాజాగా నిర్వహించిన కోవిడ్19 టెస్టులలో నటి తమన్నాకు పాజిటివ్‌ వచ్చింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News